AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Man: అరుదైన వ్యాధితో యువకుడు.. వారానికి ఒకసారి రాలుతున్న చర్మం.. రియల్ స్నేక్ మ్యాన్ అంటున్న స్థానికులు

అరుదైన చర్మ వ్యాధి కారణంగా ఆ యువకుడి శరీరం.. పాము కుబుసం విడిసినట్లు విడిపోతుంది. ఈ అరుదైనా వ్యాధి బారిన పడిన బాలుడు మనదేశంలోనే ఉన్నాడు.

Snake Man: అరుదైన వ్యాధితో యువకుడు.. వారానికి ఒకసారి రాలుతున్న చర్మం.. రియల్ స్నేక్ మ్యాన్ అంటున్న స్థానికులు
Snake Man
Follow us
Surya Kala

|

Updated on: Jun 20, 2022 | 8:40 PM

Snake Man: ప్రపంచంలోని ప్రజలకు అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. వీటిలో కొన్ని చాలా అరుదైన వ్యాధుల కేటగిరీ కిందకు వస్తాయి.. ఇలాంటి అరుదైన వ్యాధులకు చికిత్స చేయడం కోసం శాస్త్రవేత్తలు అనేక రకాల పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అరుదైన వ్యాధి ఉన్న వ్యక్తులు.. వాస్తవానికి ఆ వ్యాధి బాధను వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. కొన్ని అరుదైన జబ్బుల బారిన పడిన వ్యక్తులు.. తమ జీవితాన్ని మనస్ఫూర్తిగా నవ్వలేక, తన భావాలను వ్యక్తం చేయలేక.. గడుపుతుంటారు. కొంతమంది మెదడు తప్ప మిగిలిన శరీరాన్ని ఉపయోగించలేరు.  కానీ అలాంటి అరుదైన వ్యాధి గురించి.. ఈరోజు తెలుసుకుందాం.. అరుదైన చర్మ వ్యాధి కారణంగా ఆ యువకుడి శరీరం.. పాము కుబుసం విడిసినట్లు విడిపోతుంది. ఈ అరుదైనా వ్యాధి బారిన పడిన బాలుడు మనదేశంలోనే ఉన్నాడు.

బీహార్‌కు చెందిన మజిబర్ రెహ్మాన్ మాలిక్  అరుదైన చర్మ వ్యాధి కారణంగా ఈ రోజుల్లో చర్చలో ఉన్నాడు. 25 ఏళ్ల మాలిక్ ఎరిథ్రోడెర్మా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా అతని చర్మం ప్రతి వారం రాలిపోతుంది. ఈ స్థితిలో..  రోగి  చర్మం ఎర్రగా పొరలుగా మారుతుంది. ఈ వ్యాధిని ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు.

మాలిక్ మనోధైర్యాన్ని ఏ మాత్రం సడలించని వ్యాధి..  ఈ వ్యాధికి సంబంధించి గ్రామంలోని వైద్యులను సంప్రదించగా.. చికిత్స కోసం నగరంలోని పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అయితే మాలిక్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే.. దీంతో వ్యాధికి తగిన వైద్యం చేయించుకోలేకపోతున్నాడు. మాలిక్ కు చిన్నతనం నుంచి చదవడం అంటే చాలా ఇష్టం. కానీ ఈ అరుదైన వ్యాధి కారణంగా అతను తన చదువును కొనసాగించలేకపోయాడు. ఎందుకంటే పాఠశాలలో ఉన్న ఇతర పిల్లలు మాలిక్‌ను చూసి భయపడతారు. అతని మొహం చూసి జనాలు ‘స్నేక్ మ్యాన్’ అని కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

మాలిక్ తన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో తాను రొటీన్‌గా చేసే పనులు చూపించాడు. ఈ వీడియోలో మాలిక్ చర్మం ముడతలు, పొడి, పగుళ్లు.. సున్నితంగా రకరకాలుగా కనిపిస్తుంది.

ఈ వ్యాధి మాలిక్ శరీరాన్ని ఈ వ్యాధి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ .. అతని మనోధైర్యాన్ని ఏ మాత్రం తగ్గించలేకపోయింది. మాలిక్ అనారోగ్యాన్ని తన శక్తిగా మార్చుకున్నాడు. తనలాంటి అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారిని ఎప్పటికీ  చిన్న చూపు చూడొద్దంటూ సలహా ఇస్తున్నాడు. తన అనారోగ్యం గురించి..  మాలిక్ తన కుటుంబం , స్నేహితులు తనకు చాలా మద్దతు ఇస్తున్నారని.. అందుకని ఇతరులు తన గురించి ఏమి అన్నా తాను పట్టించుకోనని చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..