AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dani Tribe: Dani Tribe: చనిపోతే సగం కాలిన శవం ఇంట్లోనే.. మహిళ వేలు కట్.. వింత ఆచారం ఎక్కడంటే..?

ఇండోనేషియాలోని డానీ తెగ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఆదివాసీల ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ ఆచారాలు గురించి తెలిస్తే.. షాక్ తింటారు. అసలు ఇప్పటికీ ఇలాంటి సంప్రదాయాలను పాటించే వారున్నారా అంటూ ఆలోచిస్తారు

Dani Tribe: Dani Tribe: చనిపోతే సగం కాలిన శవం ఇంట్లోనే.. మహిళ వేలు కట్.. వింత ఆచారం ఎక్కడంటే..?
Indonesian Dani Tribe
Surya Kala
|

Updated on: Jun 18, 2022 | 8:31 AM

Share

Dani Tribes: ఓ వైపు ప్రపంచం.. ఆధునికత, విజ్ఞానం సాంకేతికంగా.. ప్రగతి పథంలో దూసుకుపోతుంటే.. ప్రపంచంలో మరోవైపు.. నేటికీ ఆటవిక న్యాయాన్ని అనుసరిస్తున్న జనం కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రపంచంలోని అడవులలో నివాసిస్తున్న అనేక  గిరిజన తెగలు.. ఆధునికతకు దూరంగా.. ఆటవిక జీవితాన శైలిని ఇప్పటికి అనుసరిస్తూ.. జీవిస్తున్నారు. ప్రపంచాన్ని మన చేతుల్లో చూపిస్తున్న సాంకేతిక అందుబాటులోకి వచ్చినా నేటికీ మన ఆధునిక ప్రపంచం గురించి తెలియని.. లేదా వారి ప్రపంచం గురించి మనకు తెలియని కొన్ని గిరిజన సమూహాలు ఉన్నాయి. వారు ఆదిమ మానవుల వలె అడవిలో నివసిస్తున్నారు. వారి ఆహారం, జీవనశైలి చాలా విచిత్రంగా ఉంటుంది.  ఇండోనేషియాలోని(Indonesia) పాపువా న్యూ గినియాలో నివసించే డాని తెగకు చెందిన ఆదివాసీల ఆచారాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ ఆచారాలు గురించి తెలిస్తే.. షాక్ తింటారు. అసలు ఇప్పటికీ ఇలాంటి సంప్రదాయాలను పాటించే వారున్నారా అంటూ ఆలోచిస్తారు. ఈ తెగ ఒకటి ఉందని 83 సంవత్సరాల క్రితం వరకూ ప్రపంచానికి తెలియదు. ఈ తెగ ప్రజలకు దూరంగా జీవిస్తుంది.. కనుక వీరి చిత్రాలను తీయడం చాలా కష్టం. అయితే కొంతమంది.. ఆ గిరిజన ఆచార వ్యవహారాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వారిని కలిశారు. వారి చిత్రాలను, వింత ఆచారాలను ప్రపంచం ముందు తీసుకుని వచ్చారు.

ఇంట్లో సగం కాలిన శవాన్ని అలకరించుకుంటారు.  వందల ఏళ్ల క్రితం ఈ మనుషులు మనుషుల శవాలను తిని జీవించేవారని.. కాలక్రమంలో జంతువులను చంపి వాటి మాంసాన్ని తినడం ప్రారంభించారని తెలుస్తోంది. ఈ తెగ మరో విచిత్రమైన ఆచారం ఏమిటంటే.. తమ బంధువులు, లేదా సొంత కుటుంబ సభ్యులు మరణిస్తే.. వారు ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టరు.. లేదా పూర్తిగా కాల్చరు. సగం కాల్చి ఆ  మృతదేహాలను ఇంటికి తీసుకుని వస్తారు.

సగం కాలిన శవాన్ని అందరూ తాకలేరు మీడియా కథనాల ప్రకారం.. మృతదేహాలను సగం వరకు కాల్చిన తర్వాత, ఈ వ్యక్తులు దానిపై పంది కొవ్వును రాసి ఆ శవాలను మమ్మీలుగా చేసి ప్రత్యేక గుడిసెలో ఉంచుతారు. ఈ గుడిసెలోకి అందరినీ వెళ్లనివ్వరు. ఎంపిక చేసిన కొందరిని మాత్రమే గుడిసె లోపలికి అనుమతిస్తారు. వారు కూడా మమ్మీని తాకరు.

ఇవి కూడా చదవండి

ఈ తెగ అత్యంత ప్రమాదకరమైన ఆచారం ఏమిటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు.. ఆ వ్యక్తి కుటుంబంలో ఉన్న స్త్రీ  వేలుని కత్తిరిస్తారు. ఇలా ఒక్కసారి కాదు.. ప్రతి సారీ జరుగుతుంది..  అంటే ఎవరైనా ఇంట్లోని కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడల్లా స్త్రీ ఒకొక్క వేలు కత్తిరించబడుతుందన్నమాట..డాని తెగ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేస్తూ.. 1965లో డెడ్ బర్డ్స్ అనే చిత్రాన్ని చిత్రనిర్మాత రాబర్ట్ గార్డనర్ రూపొందించాడు. (Source)

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..