AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dead Sea: ఈ సముద్రంలో మునిగిపోలేరు.. దీనిలోని మినరల్స్ మానవాళికి పకృతి ఇచ్చిన వరం..

Dead Sea: ఈతరానివారు కూడా ఈదుకుంటూ సముద్రాన్ని ఈదుతూ.. ఆస్వాదించగలిగే సముద్రం గురించి ఈరోజు తెలుసుకుందాం.. ఈ సముద్రంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీరు కోరుకున్నప్పటికీ ఈ సముద్రంలో మునిగిపోలేరు..

Dead Sea: ఈ సముద్రంలో మునిగిపోలేరు.. దీనిలోని మినరల్స్ మానవాళికి పకృతి ఇచ్చిన వరం..
Dead Sea
Surya Kala
|

Updated on: Jun 12, 2022 | 4:04 PM

Share

Dead Sea Amazing facts: భూమిపైన పెద్ద పెద్ద జలరాశుల సముదాయం సముద్రం. ఈ సముద్రం చాలా ప్రమాదకరమైనది. లోతైనదన్న సంగతి తెలిసిందే. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన వ్యక్తి ప్రపంచంలో లేదు అన్న సామెత గురించి తెల్సిందే.. సముద్రగర్భంలో అనేక జీవిరాశులు, అపార సంపదలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇక గజ  ఈతగాడు మాత్రమే సముద్రాన్ని ఈదగలడని అంటారు. సముద్రంలో ఈదాలనే కోరిక తీర్చుకోవడానికి, చాలా మంది తమ జీవితాలను లెక్కచేయరు. అయితే మీకు ఈత కొట్టడం తెలియకపోయినా.. సముద్ర ప్రయాణాన్ని ఆస్వాదించాలని మీరు కోరుకుంటే.. ఈతరానివారు కూడా ఈదుకుంటూ సముద్రాన్ని ఈదుతూ.. ఆస్వాదించగలిగే సముద్రం గురించి ఈరోజు తెలుసుకుందాం..  ఈ సముద్రంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీరు కోరుకున్నప్పటికీ ఈ సముద్రంలో మునిగిపోలేరు..

జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న డెడ్ సీ..  ఇది ప్రపంచంలోని అన్ని సముద్రాల కంటే ఎక్కువ ఉప్పగా ఉండే సముద్రం.  ఈ సముద్రంలోని నీరు అత్యంత ఉప్పుగా ఉండడంతో ఇతర సాలమండర్ల కంటే 6 నుండి 7 రెట్లు ఎక్కువ ఉప్పు  లభిస్తుంది. నీటిలో ఉప్పు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ ఎవరూ మునిగిపోరు. దీంట్లో నీటి ప్రవాహం దిగువ నుండి పైకి ఉంటుంది. కనుక మీరు నేరుగా పడుకుని ఈ సముద్రంలో మునిగిపోలేరు. దీనితో ఈ సముద్రం తీరం ఎల్లప్పుడూ పర్యాటకుల సందడి నెలకొని ఉంటుంది.

 ప్రకృతి ప్రసాదించిన వరం డెడ్ సీ: ఈ సముద్రపు నీరు చాలా ఉప్పగా ఉంటుంది. ఇక్కడ మొక్క కాదు కదా.. చిన్న గడ్డి కూడా మొలవదు. అంతేకాదు ఈ సముద్రంలో చేపలు, ఇతర జీవులు కనిపించవు. అందుకే గ్రీకు రచయిత ఈ సముద్రానికి డెడ్ సీ అని పేరు పెట్టాడు. అయితే దీనిని అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. హిబ్రూలో దీనిని ఉప్పు సముద్రం అని పిలుస్తారు. చెప్పాలంటే.. ఈ సముద్రానికి కాలక్రమంలో అనేక పేర్లు మారాయి. అయితే ఎక్కువగా మృత సముద్రంగా గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యానికి మేలు: ఈ సముద్రంలో ఉండే మినరల్స్ సరదాకే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. స్నానం చేస్తే మనుషుల రోగాలు పోతాయి. అందుకే ఇది కేవలం సముద్రం మాత్రమే కాదు, వేల సంవత్సరాల  క్రితం మానవాళికి ప్రకృతి ఇచ్చిన వరం. ఈ సముద్రంలోని ఉన్న లక్షణాల కారణంగా..  2007లో ప్రపంచంలోని 7 కొత్త అద్భుతాల జాబితాలో ఒకటిగా చేర్చబడింది.(Source)

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..