Eco Mermaid Woman: సముద్రం రక్షణ కోసం ఈదుతున్న ఓ మహిళ.. తాజాగా 12 గంటల పాటు ఈత కొట్టి ప్రపంచ రికార్డ్..
Eco Mermaid Woman: ఎస్టోనియా నివాసి అయిన మెర్లే లివాండ్.. సముద్రంలో 26.22 మైళ్లు లేదా 42.2 కిలోమీటర్లు ఈదుతూ తన ప్రపంచ రికార్డును తానే మళ్ళీ బీట్ చేసింది.
Eco Mermaid Woman: వ్యాయామం శరీరానికి ఎంత మేలు చేస్తుందో, అదే విధంగా స్విమ్మింగ్ కూడా ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈత కొట్టడాన్ని ఇష్టపడే వారు కోట్లాది మంది ఉన్నారు. వారిలో సముద్రంలో ఈత కొట్టడాన్ని ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది వ్యక్తులు ఔత్సాహికులుగా ఈత కొట్టినప్పటికీ, కొంతమంది ప్రొఫెషనల్‌గా స్విమ్మర్స్ కావడం విశేషం. అయితే ఈత కారణంగా ప్రపంచవ్యాప్తంగా తమ పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నవారు అనేకమంది ఉన్నారు.. వారిలో ఒకరు ఈత కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించిన మెర్లే లివాండ్ అనే మహిళ .
ఈత కొట్టడం అంత సులభం కాదు. దీనికి చాలా శక్తి అవసరం. సర్వ సాధారణంగా.. ఒక వ్యక్తి అరగంట పాటు ఈత కొడితే అతను అలసిపోతాడు. అయితే మెర్లే లివాండ్ అనే మహిళ సముద్రంలో దాదాపు 12 గంటల పాటు నిరంతరం ఈదుతూ ఉంటుంది. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు.. కానీ పూర్తిగా నిజం.
వీడియో చూడండి:
వాస్తవానికి.. ఎస్టోనియా నివాసి అయిన మెర్లే లివాండ్.. సముద్రంలో 26.22 మైళ్లు లేదా 42.2 కిలోమీటర్లు ఈదుతూ తన ప్రపంచ రికార్డును తానే మళ్ళీ బీట్ చేసింది. ఇంతకుముందు 18.6 మైళ్లు అంటే 30 కిలోమీటర్లు ఈదుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకున్న మెర్లే లివాండ్… ఇప్పుడు తన సొంత రికార్డును బద్దలు కొట్టింది. సముద్రంలో అత్యంత దూరం ఈదుతూ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఎస్టోనియా నివాసి అయిన మెర్లే లివాండ్.. సముద్రంలో 26.22 మైళ్లు లేదా 42.2 కిలోమీటర్లు ఈదుతూ తన ప్రపంచ రికార్డును తానే మళ్ళీ బీట్ చేసింది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. మెర్లే లివాండ్ ను ‘ఎకో మెర్మైడ్’ అని కూడా పిలుస్తారు. సముద్రం గురించి అవగాహన కల్పించేందుకు ఆమె చేప మొప్పలు ధరించి ఈదుతోంది. సముద్రంలో ఈత కొడుతున్న సమయంలో తాను చాలా సమస్యలను ఎదుర్కుంటానని లివాండ్ చెప్పింది. ఒకసారి సముద్రంలో చాలా ప్రమాదకరమైన జెల్లీ ఫిష్ బారిన పడింది. ఈ జెల్లీ ఫిష్ ఆమెను కరిచింది. అయినప్పటికీ తాను తన లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు.. సముద్రం పర్యావరణం రక్షణ కోసం కట్టుబడి ఉన్నట్లు చెప్పింది. ఒకేసారి ఈదుతున్న సమయంలో ప్లాస్టిక్ ముక్కనోటిలోకి వెళ్ళింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మెర్లే లివాండ్ ఈత కొట్టడం కొనసాగిస్తూనే ఉంది. చివరకు తన లక్ష్యాన్ని సాధించింది. తాజాగా ప్రపంచ రికార్డ్ ను సొంతం చేసుకుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..