AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గిన్నిస్ బుక్‌లో రికార్డ్ కోసం ఓ వ్యక్తి సాహసం.. 24 గంటల్లో 765 సార్లు బంగీ జంప్.. వీడియో వైరల్

ప్రపంచ రికార్డుని సృష్టించడానికి కొంతమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాంకోస్ మారి బంగీ జంపింగ్ చేసిన విధానం చూసిన వారు ఎవరైనా ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అతను 24 గంటల్లో 765 సార్లు బంగీ జంపిం చేసి అందరికీ షాక్ ఇచ్చారు.

Viral Video: గిన్నిస్ బుక్‌లో రికార్డ్ కోసం ఓ వ్యక్తి సాహసం.. 24 గంటల్లో 765 సార్లు బంగీ జంప్.. వీడియో వైరల్
French Man World Record
Surya Kala
|

Updated on: Jun 04, 2022 | 6:35 PM

Share

Viral Video: బంగీ జంపింగ్ పేరు వినని వారు బహుఅరుదు. ఒక ప్రసిద్ధ సాహస క్రీడ. సాహసాన్ని ఇష్టపడే ప్రజలు కొండల నుండి లేదా ఎత్తైన ప్రదేశాల నుండి దూకి అద్భుతమైన విన్యాసాలు చేస్తారు. అయితే ఈ బంగీ జంపింగ్ చేయడం అందరికి సాధ్యంకాదు.. చేయాలంటే సాహసం, దైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే సాధారణంగా ప్రపంచంలో ఎక్కువ మంది ఎత్తు అంటే భయపడుతుంటారు.  అటువంటి పరిస్థితిలో.. ఎత్తులు ఎక్కాలన్నా, అక్కడ నుంచి దూకాలన్నా ధైర్యం లేకుంటే, వారికి గుండెపోటు వస్తుంది. అయితే కొంతమంది చాలా ధైర్యంగా ఉంటారు. బంగీ జంపింగ్ చేసే ధైర్యం కలిగిన వృద్ధుల గురించి కూడా తరచుగా వింటూనే ఉన్నాం..ఇక తాజాగా అలాంటి ధైర్యవంతుల్లో ఒకరు ఒకరు ఫ్రాన్స్ నివాసి ఫ్రాంకోస్ మారి. బంగీ జంపింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించారు.

ప్రపంచ రికార్డుని సృష్టించడానికి కొంతమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో  ఫ్రాంకోస్ మారి బంగీ జంపింగ్ చేసిన విధానం చూసిన వారు ఎవరైనా ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అతను 24 గంటల్లో 765 సార్లు బంగీ జంప్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. సాధారణంగా ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఎత్తు నుండి దూకడానికే చాలామంది వణికిపోతుంటారు. మరి అలాంటిది ఫ్రాంకోస్ వందల సార్లు ఈ ఫీట్ చేశారు. ఇది నిజంగా అతని దైర్యం అభినందనీయం అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఫ్రాంకోస్ పేరుతో సరికొత్త రికార్డ్: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. స్కాట్లాండ్‌లోని పిట్లోచ్రీలో (Pitlochry) గ్యారీ నదిపై ఉన్న వంతెనపై ఫ్రాంకోస్ బంగీ జంపింగ్ ఫీట్ చేశారు. మంగళవారం ఉదయం 10.10 గంటలకు ప్రారంభించి .. బుధవారం ఉదయం 10.10 గంటలకు ఈ  జంప్ ను ముగించాడు. ఈ సమయంలో అతను మొత్తం 765 సార్లు దూకాడు. దీంతో ఆయన పేరు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా నమోదైంది.

ఇవి కూడా చదవండి

మైక్ హర్డ్ రికార్డును బద్దలు కొట్టిన ఫ్రాంకోస్ ఫ్రాంకోస్ చేసిన ఈ వింత విన్యాసాన్ని చూసేందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టీమ్ కూడా అక్కడికి చేరుకుంది. మీడియా నివేదికల ప్రకారం, ఫ్రాంకోస్ కంటే ముందు, ఈ ఫీట్ 2017 సంవత్సరంలో న్యూజిలాండ్‌కు చెందిన మైక్ హర్డ్ చేసాడు. అతను మొత్తం 430 సార్లు బంగీ జంపింగ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అయితే ఇప్పుడు ఫ్రాంకోస్ మైక్ రికార్డును  బద్దలు కొట్టడమే కాకుండా.. సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..