AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blennies fish: నీటిని మరచి నేలమీద జీవించడం నేర్చుకున్న చేపలు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి

చేపలు నీటిలో నివసిస్తాయని .. వాటిని నీటి నుండి బయటకు తీస్తే, అవి ఎక్కువ కాలం జీవించలేవన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నీటిలో కాకుండా భూమిపై జీవించే చేపలు ఉన్నాయని మీకు తెలుసా?

Blennies fish: నీటిని మరచి నేలమీద జీవించడం నేర్చుకున్న చేపలు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి
Blennies Fish
Surya Kala
|

Updated on: May 24, 2022 | 1:07 PM

Share

Blennies fish: ప్రకృతిలోని అందాలు హృదయానికి గొప్ప ప్రశాంతతను ఇస్తాయి. పచ్చదనం మధ్య జీవించడం, పర్వతాలపై నడవడం, సముద్రం ఒడ్డున కూర్చుని అలలను చూడటం లేదా నీటిలో ఈదుతున్న చేపలను చూడటం వంటివి చూస్తుంటే.. మనం కూడా ప్రకృతిలో ఒక భాగంగా మారి.. మరో ప్రపంచంలో అడుగు పెట్టాలనిపిస్తుంది. అయితే కొంతమంది నీటిలో ఈత కొట్టే చేపలను చూసి ఆనందిస్తారు. అందుకనే డాల్ఫిన్ వంటి చేపల ఎక్వైరీయంలో పెంచుతూ.. పర్యాటకులను ఆకర్షిస్తుంటారు. అందుకనే వీటిని ఎక్కువమంది ముద్దుగా జలపుష్పాలు అని పిలుచుకుంటారు. చేపలు నీటిలో నివసిస్తాయని ..  వాటిని నీటి నుండి బయటకు తీస్తే, అవి ఎక్కువ కాలం జీవించలేవన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకనే వీటిని ఎక్కువమంది ముద్దుగా జలపుష్పాలు అని పిలుచుకుంటారు. అయితే నీటిలో కాకుండా భూమిపై జీవించే చేపలు ఉన్నాయని మీకు తెలుసా? అవును, ఇది చాలా విచిత్రమైన విషయం.. కానీ ఇది నిజం. కొన్ని సంవత్సరాల క్రితం, శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేసారు.. ఆ పరిశోధనలో ఒక జాతి చేప నీటిని వదిలి భూమిపై నివసించడం ప్రారంభించినట్లు వెల్లడైంది. ఈ ప్రత్యేక జాతి చేప పేరు ‘బ్లెన్నీస్’.  ఈ చేప గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

  1. మీడియా నివేదిక ప్రకారం.. బ్లెన్నీస్ జాతుల చేపలు చాలాసార్లు సముద్రం నుండి బయటకు వచ్చి భూమిపై ఎక్కువ సమయం గడిపాయని, తద్వారా అవి క్రమంగా భూమిపై జీవించడం నేర్చుకున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పుడు ఈ జాతికి చెందిన అనేక రకాల చేపలు ఉన్నాయి. ఇవి నీటిని పూర్తిగా మరచిపోయి.. భూమిలోనే తమ శాశ్వత నివాసంగా చేసుకున్నాయి. భూమిలోపల గుంతలు తీసుకుని తమ స్థిరనివాసాన్ని ఏర్పరచుకున్నాయి.
  2. నీటిని మరిచి, నేలపై జీవించే కళను నేర్చుకున్న బ్లెన్నీస్ చేపలు: ఈ జాతి చేపపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఫలితాలు ఫంక్షనల్ ఎకాలజీలో ప్రచురించబడింది. ఇందులో  బ్లెన్నీస్ జాతికి చెందిన కొన్ని చేపలు నీటిని మరచిపోయి భూమిపై జీవించే కళను నేర్చుకున్నాయని పేర్కొన్నారు. ఈ జాతికి చెందిన అనేక చేపలు ఉన్నాయని.. వీటిల్లో కొన్ని మాత్రమే సముద్రంలో నీటి అడుగున జీవిస్తున్నాయి. కానీ ఎక్కువ రకాలు తమ జీవితాన్ని భూమి మీదనే ఏర్పరచుకున్నాయని.. తెలిపారు. అయితే ఈ చేపలు తన జీవితంలో ఈ ముఖ్యమైన మార్పును ఎందుకు కోరుకున్నాయి.. ఎలా నీటిని విడిచి నేలమీదకు చేరుకున్నాయనే విషయం పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
  3. శాస్త్రవేత్తల ప్రకారం.. బ్లెన్నీస్ చేపలు సముద్రపు అలలతో పాటు.. కొట్టుకుని వచ్చి.. ఒడ్డుకు చేరుకుంటాయి. ఇలా ఒడ్డుకు చేరుకునే సమయంలో.. కొన్ని చేపలు మరణిస్తాయి. మరికొన్ని చేపలు.. తాము నేలపై జీవించడాన్ని ‘ప్రాక్టీస్’ చేశాయి. అలా కాలక్రమంలో బెన్నీస్ చేపలు సముద్రాన్ని విడిచి నేలమీదనే జీవించేలా తమని తాము తీర్చిదిద్దుకున్నాయి. అయితే ఈ చేపలు భూమిపై జీవించడం ప్రారంభించినప్పటికీ.. తమని తాము తడిగా ఉంచుకునే విధంగా భూమిలో బొరియలు తీసుకుని అందులో నివసిస్తాయి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌   వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి