Antique Flower Vase: 40 ఏళ్లుగా వంటగదిలో ‘వృధా’గా పడి ఉన్న ప్లేవర్ వేజ్.. అమ్మితే రూ. 11 కోట్ల
అదృష్టం తలుపు తడితే.. ఆ వ్యక్తి జీవితం మారడానికి ఎక్కువ సమయం పట్టదు అని అంటారు. తాజాగా ఓ కుటుంబం ఇంట్లో ఉన్న ఓ పురాతన కూజా వారిని రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మార్చేసింది. ఈ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది.
Antique Flower Vase: దురదృష్ట వంతుడిని బాగుచేసేవాడు లేదు.. అదృష్టవంతుడిని పాడు చేసేవాడు లేడనేది సామెత. అవును దురదృష్టం ఎప్పుడుఎక్కడ ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అదృష్టం తలుపు తడితే.. ఆ వ్యక్తి జీవితం మారడానికి ఎక్కువ సమయం పట్టదు అని అంటారు. తాజాగా ఓ కుటుంబం ఇంట్లో ఉన్న ఓ పురాతన కూజా వారిని రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మార్చేసింది. ఈ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది.
ప్రపంచంలో అతి పురాతన అరుదైన, శతాబ్దాలు చరిత్ర కలిగిన వస్తువులు పట్ల ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. అరుదైన వస్తువుల పట్ల ఆకర్షణ ఎప్పటికీ ఒకేలా ఉంది. కాలక్రమేణా వాటి విలువ పెరుగుతుంది. అలాంటి ఫ్లవర్ వేజ్ ఒకటి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇది 18వ శతాబ్దానికి సంబంధించినది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఫ్లవర్ వేజ్ చైనాకు చెందిన కుటుంబంలో గత 40 ఏళ్లుగా ఉంది. అయితే ఈ కుటుంబంలో వారు ఈ ప్లవర్ వేజ్ తమకు ఎటువంటి ఉపయోగం లేదని భావించారు. అదొక పనికిరాని వస్తువుగా భావించి దానికి ఒక మూలపడేశారు. అయితే అది అరుదైన అతిపురాతనమైన ఫ్లవర్ వేజ్ అని.. తమకు లక్షలు కురిపించగలదని వారు ఒక్కరోజు కూడా ఊహించలేదు.
ఈ ఫ్లవర్ వేజ్ బ్రిటన్‌లోని మిడ్‌లాండ్స్‌లో నివసిస్తున్న ఒక కుటుంబం వద్ద ఉంది. ఈ కుటుంబ సభ్యులు 1980ల్లో ఈ జాడీని కొనుగోలు చేశారు. ఎందుకంటే ఈ ఫ్లవర్ వేజ్ చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ఇంట్లో అలంకరణకు మాత్రమే వాడేవారు. అయితే కాల క్రమంలో కొంచెం పగుళ్లు ఏర్పడిన అనంతరం.. ఆ కుటుంబం దానిని వాడడం మానేశారు. అదే సమయంలో.. ఒక పురాతన నిపుణుడి దృష్టిలో ఈ ఫ్లవర్ వేజ్ పడింది. అప్పుడు ఆ కుటుంబానికి ఈ జాడీ ప్రాముఖ్యత గురించి తెలిసింది.
ఫ్లవర్ వేజ్ విశిష్టత: రెండు అడుగుల పొడవున్న ఈ ఫ్లవర్ వేజ్ అందమైన ఆకర్షణీయమైన నీలం రంగులో ఉంది. వెండి, గోల్డ్ తో అందమైన లతలు, కొంగలు వంటి డిజైన్స్ తో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. ఈ పురాతన వస్తువు.. 18వ శతాబ్దపు రాజు కియాన్‌లాంగ్ నాటిదని.. 6-అక్షరాల ముద్రను బట్టి తెలుసుకున్నారు. ఈ రాచరికపు ఫ్లవర్ వేజ్ బంగారం, వెండితో చేశారని అందరూ షాక్ తిన్నారు. అంతేకాదు ఈ వేజ్ పై ‘ఎనిమిది అమర’ చిహ్నాలు కూడా ఉన్నాయి. ఇది ఇంట్లో దీర్ఘాయువు , శ్రేయస్సు కి చిహ్నంగా పరిగణించబడుతుంది.
ఈ ఫ్లవర్ వేజ్ ధర ప్రస్తుతం రూ. 1 కోటి 44 లక్షలని నిర్ధారించారు. అయితే చైనాకు చెందిన ఓ గొప్ప ధనవంతుడు.. దీనిని దాదాపు 1.2 మిలియన్ పౌండ్లకు (మనదేశ కరెన్సీలో దాదాపు రూ. 11 కోట్ల 53 లక్షలు) కొనుగోలు చేశాడు. తమ వంశీయులు పోగొట్టుకున్న తమ వారసత్వ సంపదను తిరిగి పొందినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..