Davos Tour: దావోస్‌ చేరుకున్న సీఎం జగన్.. సదస్సు తొలిరోజు పలువురితో సమావేశం.. రేపు WEFతో కీలక ఒప్పదం

సీఎం జగన్ మోహన్ రెడ్డి దావోస్‌ చేరుకున్నారు. జురెక్, దావోస్‌ల్లో సీఎంకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈరోజు నుంచి ప్రారంభం కానున్న వరల్డ్‌ఎకనమిక్‌ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు.

Davos Tour: దావోస్‌ చేరుకున్న సీఎం జగన్.. సదస్సు తొలిరోజు పలువురితో సమావేశం.. రేపు WEFతో కీలక ఒప్పదం
Cm Jagan Davos Tour
Follow us

|

Updated on: May 22, 2022 | 1:53 PM

CM Jagan Davos Tour: వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో (World Economic Forum )పాల్గొనేందుకు ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ దావోస్‌ చేరుకున్నారు. నేటి నుంచి ప్రారంభం కానున్న వరల్డ్‌ఎకనమిక్‌ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటారు. వర్డల్‌ఎకనామిక్‌ ఫోరం సదస్సు జరగనున్న కాంగ్రెస్‌ వేదికగా ఈరోజు ఉదయం డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాజ్‌ ష్వాప్‌తో ఏపీ ఒప్పందం కుదుర్చుకోనుంది. డబ్ల్యూఈఎఫ్‌(WEF) నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది

WEF హెల్త్‌ విభాగం అధిపతి, డాక్టర్‌ శ్యాం బిషేన్‌తోకూడా సీఎం జగన్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హన్స్‌ పాల్‌బర్కనర్‌తో ముఖ్యమంత్రి ఏపీ లాంజ్‌లో సమావేశం కానున్నారు. సాయంత్రం డబ్ల్యూఈఎఫ్‌ కాంగ్రెస్‌ వేదికలో జరిగే వెల్‌కం రిసెప్షన్‌కు సీఎం జగన్ మోహన్ రెడ్డి  హాజరుకానున్నారు.

జురెక్, దావోస్‌ల్లో సీఎంకు ఘనస్వాగతం

ఇవి కూడా చదవండి

జురెక్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డికి  స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌ సీఎంకు సాదర స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్‌లో భారత ఎంబసీ రెండో కార్యదర్శి రాజీవ్‌కుమార్, ఎంబసీలో మరొక రెండవ కార్యదర్శి బిజు జోసెఫ్‌ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. స్విట్జర్లాండ్‌లో ఉంటున్న తెలుగువారు కూడా సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు