America: వేల అడుగుల ఎత్తులో.. విమానంలో మహిళ ప్రసవం.. చిన్నారికి ఏ పేరు పెట్టారంటే

ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణం. ఓ నిండు గర్భిణీ విమానం ఎక్కింది. సవ్యంగా సాగిపోతున్న ఆమె ప్రయాణంలో ఊహించని మార్పు చోటు చేసుకుంది. నెలలు నిండటంతో ఆమె సీట్లో కూర్చోగానే పురుటి నొప్పులు....

America: వేల అడుగుల ఎత్తులో.. విమానంలో మహిళ ప్రసవం.. చిన్నారికి ఏ పేరు పెట్టారంటే
Baby Born In Flight
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 22, 2022 | 7:23 AM

ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణం. ఓ నిండు గర్భిణీ విమానం ఎక్కింది. సవ్యంగా సాగిపోతున్న ఆమె ప్రయాణంలో ఊహించని మార్పు చోటు చేసుకుంది. నెలలు నిండటంతో ఆమె సీట్లో కూర్చోగానే పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కొద్ది సేపటికే అవి ఎక్కువయ్యాయి. గర్భిణి అవస్థను గమనించిన విమాన సిబ్బంది ఆమెకు దగ్గరుండి సపర్యలు చేశారు. చిన్నారిని సురక్షితంగా అమ్మ కడుపు నుంచి బయటకు తీశారు. ఈ ఘటనతో విమాన సిబ్బంది, ప్రయాణికులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన అమెరికాకు చెందిన ప్రాంటియర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో జరిగింది. డెన్వర్‌ నుంచి ఒర్లాండోకు వెళుతున్న విమానంలో షకేరియా మార్టిన్‌ అనే మహిళ ప్రయాణించారు. అయితే విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో విమాన సిబ్బందిలో ఒకరైన డయానా గిరాల్డో అనే మహిళ షకేరియాను బాత్‌రూంలోకి తీసుకెళ్లారు. ఆమె అక్కడే ప్రసవించారు. ప్రసవానంతరం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ప్రాంటియర్‌ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది.

ప్రసవానికి సహకరించిన సిబ్బంది డయానా గిరాల్డోను ఆ సంస్థ ప్రశంసించింది. అది వీరోచితమైన పనిగా ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ కెప్టెన్ క్రిస్ నై, విమాన సిబ్బంది అందరూ డయానా గిరాల్డోను కొనియాడారు. విమానంలో జన్మించిన ఆ శిశువుకు కుటుంబ సభ్యులు ‘స్కై’గా నామకరణం చేసినట్లు ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Pakka Commercial: శరవేగంగా మారుతి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. పక్కా కమర్షియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

MI vs DC IPL Match Result: ఢిల్లీ పై ముంబై విజయం.. ముంబై విన్ తో ప్లే ఆఫ్ కు చేరిన బెంగుళూరు