Petrol-Diesel Rate Today: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేంద్రం నిర్ణయంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు ఇలా..

Petrol-Diesel Rate Today: చమురు మార్కెటింగ్ కంపెనీలు 22 మే 2022 ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 8, డీజిల్‌పై 6 ఎక్సైజ్ ..

Petrol-Diesel Rate Today: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేంద్రం నిర్ణయంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు ఇలా..
Follow us
Subhash Goud

|

Updated on: May 22, 2022 | 7:10 AM

Petrol-Diesel Rate Today: చమురు మార్కెటింగ్ కంపెనీలు 22 మే 2022 ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 8, డీజిల్‌పై 6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దిగివచ్చాయి. దేశంలోని అతిపెద్ద చమురు మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.96.72 కి తగ్గింది. ఇక లీటర్ డీజిల్‌కు ఇప్పుడు రూ.89.62 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత పెట్రోల్ ధర రూ.8.69, డీజిల్ ధర రూ.7.05 తగ్గింది. మరోవైపు ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.35 ఉండగా, డీజిల్ ధర రూ.97.28కి చేరుకుంది. ఇక్కడ లీటరు పెట్రోల్‌పై రూ.7.16, డీజిల్‌పై రూ.7.49 చొప్పున తగ్గాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.82గా ఉంది.

అలాగే కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.03 ఉండగా, డీజిల్‌ ధర రూ.92.76 ఉంది. గతంలో లీటరు చమురు పెట్రోల్‌, డీజిల్‌ ధర వరుసగా రూ.115.12, రూ.99.83గా ఉన్నాయి. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63 ఉండగా, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. ఇక్కడ పెట్రోలు, డీజిల్ ధర లీటరుకు రూ.8.22, రూ.6.70 తగ్గింది. మీరు మీ నగరంలో పెట్రోల్ మరియు డీజిల్ తాజా ధరలను చూడాలనుకుంటే, మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తనిఖీ చేయవచ్చు. మోడీ ప్రభుత్వం డీజిల్-పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులకు పెద్ద ఉపశమనం అనే చెప్పాలి.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు కుప్పకూలుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.46 శాతం పెరిగి 112.5 డాలర్లకు చేరుకుంది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.35 శాతం పెరిగి 110.3 డాలర్లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

రెండు నెలల్లో CNG ధర రూ.19.60 పెరిగింది ఢిల్లీలో శనివారం సీఎన్‌జీ ధరలు కిలోకు రూ.2 చొప్పున పెరిగాయి. దీంతో గత రెండు నెలల్లో 13వ సారి సీఎన్‌జీ ధరలు పెరిగాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లలో సీఎన్‌జీ ధర కిలోకు రూ.73.61 నుంచి రూ.75.61కి పెరిగింది. మార్చి 7 నుంచి ధరలు పెరగడం ఇది 13వ సారి. మొత్తంగా ఈ కాలంలో సీఎన్‌జీ ధర కిలోకు రూ.19.60 పెరిగింది. గత ఏడాదిలో కిలోకు రూ.32.21 లేదా 60 శాతం వరకు ధరలు పెరిగాయి.

ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల పెట్రోల్, డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి. మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా తెలుసుకోవచ్చు.  మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌ (Message) పంపితే ధరల వివరాలు వస్తాయి. మీ నగరంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను SMS రూపంలో తెలుసుకునేందుకు RSP కోడ్ కోసం ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.