MI vs DC IPL Match Result: ఢిల్లీ పై ముంబై విజయం.. ముంబై విన్ తో ప్లే ఆఫ్ కు చేరిన బెంగుళూరు
ముంబై ఇండియన్స్ IPL 2022 తాజాగా మ్యాచ్ లో ఢిల్లీ పై విజయం సాధించింది. ముంబై టోర్నమెంట్‌లోని చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.
MI vs DC IPL Match Result: ముంబై ఇండియన్స్ IPL 2022 తాజాగా మ్యాచ్ లో ఢిల్లీ పై విజయం సాధించింది. ముంబై టోర్నమెంట్‌లోని చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. ఈ సీజన్‌ను విజయంతో ముగించడమే కాకుండా, రోహిత్ శర్మ జట్టు తన విజయాన్ని కొనసాగించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెంగుళూరు టైటిల్ రేసులో చేరింది. ఈ సీజన్‌లో ఢిల్లీ ప్రయాణాన్ని ముగించిన వాంఖడే స్టేడియంలో ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించడంతో ప్లేఆఫ్‌కు బెంగళూరుకు చేరుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ టీం ముందు 160 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఢిల్లీ టీంలో రొవ్‌మెన్ పావెల్ 43 పరుగులు (34 బంతులు, 1 ఫోర్, 4 సిక్సులు)లతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆ తర్వాత రిషబ్ పంత్ 39 (33 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్), షా 24, పరుగులతో ఆకట్టుకున్నారు. బుమ్రా 3, రమన్‌దీప్ 2, సామ్స్, మార్కాండే తలో వికెట్ పడగొట్టారు. 160 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ కుదిగిమ ముంబై ఆచితూచి ఆడింది. రోహిత్ శర్మ కేవలం రెండు పరుగులకే అవుట్ అయ్యాడు. ముంబయి ఐదు వికెట్లను కోల్పోయి 19.1 ఓవర్లలో 160 పరుగులు చేసి విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (48), బ్రెవిస్ (37), టిమ్ డేవిడ్ (34), తిలక్ వర్మ (21), రమణ్‌దీప్ (13 ) రాణించారు. దిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, నోకియా 2, కుల్‌దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు. ముంబై విజయం సాధించడం తో బెంగుళూరు ప్లే ఆఫ్ కు చేరుకుంది. గుజరాత్ (20), రాజస్థాన్ (18), లఖ్‌నవూ (18), బెంగళూరు (16) ప్లేఆఫ్స్‌కు చేరాయి. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ మే 24, ఎలిమినేటర్ మే 25, రెండో క్వాలిఫయర్ మే 27న, ఫైనల్ మ్యాచ్ మే 29న జరుగుతుంది
మరిన్ని ఇక్కడ చదవండి :