MI vs DC Score: అదరగొట్టిన పంత్, పావెల్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
Mumbai Indians vs Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో ముంబై ముందు 161 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
IPL 2022 69వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతోంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ టీం ముందు 160 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఢిల్లీ టీంలో రొవ్‌మెన్ పావెల్ 43 పరుగులు (34 బంతులు, 1 ఫోర్, 4 సిక్సులు)లతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఆ తర్వాత రిషబ్ పంత్ 39 (33 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్), షా 24, పరుగులతో ఆకట్టుకున్నారు. బుమ్రా 3, రమన్‌దీప్ 2, సామ్స్, మార్కాండే తలో వికెట్ పడగొట్టారు.
DC ఆరంభం అస్సలు బాగోలేదు..
వరుసగా రెండో మ్యాచ్ లోనూ వార్నర్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తొలి బంతికి ఔటయ్యాడు. DC డూ ఆర్ డై మ్యాచ్‌లో ప్రారంభం చాలా పేలవంగా మొదలైంది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. వార్నర్ బ్యాటింగ్‌లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో మార్ష్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. వార్నర్‌ను డేనియల్ సామ్స్, మిచెల్ మార్ష్‌ను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేశారు. బుమ్రా ఓపెనర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు ముఖ్యమైన వికెట్లను తన పేరిట లిఖించుకున్నాడు.
వీరిద్దరూ ఔటైన తర్వాత పృథ్వీ షా కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేక 23 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. షా వికెట్ కూడా బుమ్రా తీశాడు. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ లు హ్యాండిల్ చేశారు. ఆ తర్వాత మయాంక్ మార్కండే వేసిన అద్భుతమైన బంతికి సర్ఫరాజ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతికి చిక్కాడు.
అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం రాలేదు..
ఐపీఎల్ 2022లో ముంబైతో జరిగిన చివరి మ్యాచ్‌లో కూడా అర్జున్ టెండూల్కర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం రాలేదు. టాస్‌కు ముందు, సోషల్ మీడియాలో అర్జున్ ఆడుతున్నట్లు చర్చ జరిగింది. అతను కూడా వార్మప్ చేస్తూ కనిపించాడు. కానీ, చివరకు చోటు మాత్రం దక్కలేదు.
రెండు జట్ల ప్లేయింగ్ XI:
ముంబై ఇండియన్స్- రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, డేనియల్ సామ్స్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే
ఢిల్లీ క్యాపిటల్స్- పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రొమైన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఎన్రిక్ నోర్త్యా, ఖలీల్ అహ్మద్
Also Read: MI vs DC Live Score, IPL 2022: కీలక ఇన్నింగ్స్ ఆడిన పావెల్, పంత్.. ముంబై టార్గెట్ 160..
MI vs DC, IPL 2022: రంగు మార్చిన బెంగళూర్ జట్టు.. ఈ ఎక్స్‌ట్రాలే వద్దంటోన్న ఫ్యాన్స్.. ఎందుకంటే?