AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

34 ఏళ్ల నాటి కేసులో టీమిండియా మాజీ క్రికెటర్‌కి ఏడాది జైలు శిక్ష.. అసలు వివాదం ఏంటంటే?

Navjot Singh Sidhu: ఈ కేసులో సిద్ధూకు శిక్ష విధించిన ధర్మాసనం క్యూరేటివ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ప్రస్తుతం దానిని ప్రధాన న్యాయమూర్తికి పంపారు. అయితే సుప్రీం కోర్టు నుంచి ఉపశమనం లభించకపోతే సిద్ధూ ఈరోజే లొంగిపోవాల్సి ఉంటుంది.

34 ఏళ్ల నాటి కేసులో టీమిండియా మాజీ క్రికెటర్‌కి ఏడాది జైలు శిక్ష.. అసలు వివాదం ఏంటంటే?
Team India Ex Cricketer Navjot Singh Sidhu
Venkata Chari
|

Updated on: May 20, 2022 | 11:32 AM

Share

భారత మాజీ ఓపెనర్‌(Team India), పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ చీఫ్ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ(Navjot Singh Sidhu)పై సుప్రీంకోర్టు(Supreme Court) తన నిర్ణయాన్ని మార్చి ఏడాది జైలు శిక్ష విధించింది. 34 ఏళ్ల నాటి కేసులో సిద్ధూకు ఈ శిక్ష పడింది. 1988లో జరిగిన రోడ్ రేజ్ కేసులో సిద్ధూను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, సంజయ్ కిషన్ కౌల్‌లతో కూడిన ధర్మాసనం ఆయనకు శిక్ష విధించింది. ఈ కేసులో సిద్ధూకి ఇంతకుముందు 3 సంవత్సరాల శిక్ష విధించారని, దానిని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే తాజాగా మళ్లీ కోర్టు తన నిర్ణయాన్ని మార్చుకుని సిద్ధూకి శిక్ష విధించింది. కాగా, సిద్ధూ సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో లొంగిపోయేందుకు ఆయన వారం రోజులు గడువు కోరారు. అనారోగ్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సిద్ధూకు శిక్ష విధించిన ధర్మాసనం క్యూరేటివ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ప్రస్తుతం దానిని ప్రధాన న్యాయమూర్తికి పంపారు. అయితే సుప్రీం కోర్టు నుంచి ఉపశమనం లభించకపోతే సిద్ధూ ఈరోజే లొంగిపోవాల్సి ఉంటుంది.

Also Read: హక్కుల కోసం దిగ్గజ బాక్సర్‌తో పోరాటం.. ఫెడరేషన్ హ్యాండిచ్చినా తగ్గని నైజం.. కట్‌చేస్తే.. చరిత్ర సృష్టించిన తెలంగాణ ముద్దబిడ్డ..

34 ఏళ్ల నాటి రోడ్ రేజ్ కేసులో సిద్ధూకు శిక్షను మరో ఏడాది పొడిగిస్తూ సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చింది. అదే సమయంలో, సిద్ధూ లొంగిపోయే సమయంలో మద్దతుదారులకు పిలుపునిచ్చారు. పాటియాలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరీందర్ పాల్ లాలీ కూడా ఈ విషయంలో పార్టీ కార్యకర్తలకు సందేశం పంపారు. సిద్ధూ ప్రస్తుతం తన పాటియాలా ఇంట్లోనే ఉన్నారు. ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ నేతల వద్దకు చేరుకోవడం ప్రారంభించారు.

హైకోర్టు నుంచి ఆదేశాలు సెషన్స్ కోర్టుకు..

ఇవి కూడా చదవండి

సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తొలుత పంజాబ్, హర్యానా హైకోర్టుకు చేరనున్నాయి. అక్కడి నుంచి పాటియాలా జిల్లా, సెషన్స్ కోర్టుకు పంపనున్నారు. సిద్ధూ స్వయంగా లొంగిపోకుంటే, అతనిని అరెస్టు చేయాలని సంబంధిత పోలీసు స్టేషన్‌ను కోరతారు.

అసలేం జరిగిందంటే?

27 డిసెంబర్ 1988న పాటియాలాలో పార్కింగ్ విషయంలో 65 ఏళ్ల గుర్నామ్ సింగ్‌తో సిద్ధూ గొడవ పడ్డాడు. సిద్ధూ అతనిపై పిడిగుద్దులు కురిపించాడు. ఆ తర్వాత గుర్నామ్ సింగ్ మరణించాడు. సిద్ధూ, అతని స్నేహితుడు రూపిందర్ సింగ్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. 1999లో సెషన్స్ కోర్టు సాక్ష్యాధారాలు లేని కారణంగా సిద్ధూను నిర్దోషిగా ప్రకటించింది. దీనిపై బాధితులు పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. 2006లో హైకోర్టు సిద్ధూకి మూడేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది.

2007 జనవరిలో సిద్ధూ కోర్టులో లొంగిపోయారు. దీంతో అతన్ని జైలుకు పంపారు. దీంతో సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 16 మే 2018న, 304ఐపీసీ సెక్షన్ కింద సిద్ధూను సుప్రీం కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, ఐపీసీ సెక్షన్ 323 ప్రకారం, గాయపరిచినందుకు, వెయ్యి జరిమానా విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబం ఎస్సీల్లో రివ్యూ పిటిషన్‌ వేసింది. తాజాగా 19 మే 2022న, సుప్రీం కోర్ట్, సిద్ధూపై తన నిర్ణయాన్ని మారుస్తూ, 323IPC కింద అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది.

కాగా, దేశ రాజకీయాలతో కదిలిన సిద్ధూ టెలివిజన్ షోలకు న్యాయనిర్ణేతగా, కొన్నిసార్లు అతిథిగా వస్తూనే ఉన్నారు. అయితే, ఈ సమయంలో, సిద్ధూ తన ప్రకటనలతో నిరంతరం వివాదాల్లో భాగమవుతూనే ఉన్నాడు. క్రికెట్, క్రికెటర్లకు సంబంధించి సిద్ధూ వివాదాలను ఒకసారి పరిశీలిద్దాం.

2004లో రాజకీయాల్లోకి వచ్చిన సిద్ధూ.. ఆటలు ఆడే రోజుల్లోనూ వివాదాలతో లోతైన అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. 1996 ఇంగ్లండ్ పర్యటన నుంచి అతను అప్పటి కెప్టెన్ అజారుద్దీన్‌పై తిరుగుబాటు చేసి, పర్యటనను మధ్యలోనే వదిలి స్వదేశానికి తిరిగి వచ్చాడు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. 2011లో బీసీసీఐ మాజీ సెక్రటరీ జయవంత్ లేలే రాసిన పుస్తకంలో సిద్ధూ ఈ మొత్తం చర్యకు సంబంధించిన వివరాలను అందించారు.

ఇమ్రాన్ ఖాన్, సిద్ధూకు క్రికెటర్‌గా పాత సంబంధం ఉంది. ఇటువంటి పరిస్థితిలో, 2018 లో అతను ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి పాకిస్తాన్ వెళ్ళాడు. అది కూడా బాగానే ఉంది. కానీ, ఆ వేడుకలో అతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బజ్వాను కౌగిలించుకోవడం ప్రజలకు నచ్చలేదు. దీంతో మరోసారి సిద్ధూ పేరు వివాదాలకు తావిచ్చింది.

నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యాతగా బాగా పేరుగాంచాడు. కానీ, అక్కడ కూడా అతను వివాదాలలో చిక్కుకోకుండా ఉండలేకపోయాడు. ఈఎస్‌పీఎన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కూడా ఆరోపించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Watch Video: ఇదేందిరయ్యా ఇలా జరిగింది.. తలపట్టుకున్న రషీద్ ఖాన్.. సంతోషంలో మాక్స్‌వెల్.. ఎందుకంటే?

IPL 2022 Playoff Scenario: బెంగళూర్ విజయంతో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ఆ రెండు జట్లు.. టాప్ 4లో ఎవరున్నారంటే?