Watch Video: ఇదేందిరయ్యా ఇలా జరిగింది.. తలపట్టుకున్న రషీద్ ఖాన్.. సంతోషంలో మాక్స్‌వెల్.. ఎందుకంటే?

ఐపీఎల్ 2022లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. గ్లెన్ మాక్స్‌వెల్ 18 బంతుల్లో 40 పరుగులతో జట్టు విజయానికి దోహదపడ్డాడు.

Watch Video: ఇదేందిరయ్యా ఇలా జరిగింది.. తలపట్టుకున్న రషీద్ ఖాన్.. సంతోషంలో మాక్స్‌వెల్.. ఎందుకంటే?
Ipl 2022, Glenn Maxwell
Follow us
Venkata Chari

|

Updated on: May 20, 2022 | 10:53 AM

ఐపీఎల్ 2022(IPL 2022) 67వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ (RCB vs GT)పై విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు ప్లేఆఫ్ రేసులో కొనసాగుతోంది. బెంగళూరు తరుపున విరాట్ కోహ్లి 73 పరుగుల ఇన్నింగ్స్ ఆడి మళ్లీ ఫామ్‌లోకి వచ్చేలా కనిపించాడు. అదే సమయంలో, గ్లెన్ మాక్స్‌వెల్ 18 బంతుల్లో 40 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు విజయాన్ని అందించాడు. తొలి బంతికే మ్యాక్స్‌వెల్‌ ఓ లైఫ్‌ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ మొదటి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. డు ప్లెసిస్‌ను అవుట్ చేయడం ద్వారా రషీద్ ఖాన్ గుజరాత్‌కు తొలి పురోగతిని అందించాడు. దీని తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ తొలి బంతికే భారీ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించినా.. బంతి వికెట్‌ను తాకింది. బంతిని కొట్టిన తర్వాత లైట్ వెలిగినప్పటికీ బెయిల్స్ పడకపోవడంతో మ్యాక్స్‌వెల్ ప్రాణాలతో బయటపడ్డాడు. అదే సమయంలో, బంతి కూడా బౌండరీ లైన్‌కు చేరింది.

Also Read: IPL 2022: ప్రపంచంలోనే ఇప్పటివరకు ఏ బ్యాట్స్‌మెన్ చేయని రికార్డ్.. కోహ్లీ ఖాతాలో చేరిన అరుదైన ఘనత.. అదేంటంటే?

కెప్టెన్ హార్దిక్ పాండ్యా అర్ధసెంచరీతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గత కొన్ని మ్యాచ్‌ల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయిన హార్దిక్.. 47 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేసి ప్లేఆఫ్‌కు ముందు ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. హార్దిక్‌తో పాటు డేవిడ్ మిల్లర్ 25 బంతుల్లో 34 పరుగులు చేశాడు. చివర్లో రషీద్ ఖాన్ 6 బంతుల్లో 2 సిక్సర్లు, ఒక ఫోర్ తో 19 పరుగులు చేశాడు. ఆర్సీబీ బౌలింగ్‌లో జోస్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫామ్‌తో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ జట్టుకు శుభారంభం అందించారు. పవర్‌ప్లేలోనే బెంగళూరు 55 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో విరాట్ రెండు అర్ధశతకాలు సాధించగా, ఇద్దరూ గుజరాత్‌పై ఔటయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఐపీఎల్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: PL 2022 Playoff Scenario: బెంగళూర్ విజయంతో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ఆ రెండు జట్లు.. టాప్ 4లో ఎవరున్నారంటే?

Watch Video: అంపైర్‌ నిర్ణయం నచ్చక పీక్స్‌కు చేరిన ఫ్రస్ట్రేషన్‌.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో విధ్వంసం.. వీడియో

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే