IPL 2022 Playoff Scenario: బెంగళూర్ విజయంతో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ఆ రెండు జట్లు.. టాప్ 4లో ఎవరున్నారంటే?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే మరో రెండు జట్ల అవకాశాలను తలనొప్పిని తెచ్చి పెట్టింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 15వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురువారం గుజరాత్ టైటాన్స్ (RCB vs GT) ని ఓడించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే, లీగ్ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఓడిపోతేనే అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ గెలిస్తే, బెంగళూరు, ఢిల్లీ జట్లు తలో 16 పాయింట్లను కలిగి ఉంటాయి. ఢిల్లీ నెట్ రన్ రేట్ బెంగళూరు కంటే మెరుగ్గా ఉంది. దీంతో రిషబ్ పంత్ జట్టు గెలుస్తుంది. బెంగళూరు సాధించిన ఈ విజయం ఢిల్లీకి తలనొప్పిగా మారగా.. మరో రెండు జట్ల కలలకు కూడా బ్రేక్ పడింది. ఈ రెండు జట్లు పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్. బెంగళూరు విజయంతో, ఈ రెండు జట్లూ ఐపీఎల్ 2022 (IPL 2022) ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి.
Also Read: హక్కుల కోసం దిగ్గజ బాక్సర్‌తో పోరాటం.. ఫెడరేషన్ హ్యాండిచ్చినా తగ్గని నైజం.. కట్‌చేస్తే.. చరిత్ర సృష్టించిన తెలంగాణ ముద్దబిడ్డ..
బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. లీగ్ దశలో ఇదే చివరి మ్యాచ్. ఈ విజయం తర్వాత, 14 మ్యాచ్‌లలో ఎనిమిది విజయాలు, ఆరు ఓటములతో 16 పాయింట్లను కలిగి ఉంది. ఈ జట్టు ఇప్పుడు నాల్గవ స్థానానికి చేరుకుంది. మరోవైపు ఢిల్లీ జట్టు 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, ఆరు ఓటములతో 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.
పంజాబ్, హైదరాబాద్‌ల పరిస్థితి..
ఈ విజయం తర్వాత పంజాబ్, హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్ నుంచి అవుటయ్యాయి. పంజాబ్ జట్టు ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఏడు ఓటములతో 12 పాయింట్లతో ఉంది. పంజాబ్ ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతుంది. యాదృచ్ఛికంగా, సన్‌రైజర్స్ కూడా పంజాబ్ స్థానంలో ఉంది. అలాగే 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఏడు ఓటములతో 12 పాయింట్లు సాధించింది. ఇటువంటి పరిస్థితిలో, ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో, అది గరిష్టంగా 14 పాయింట్లను కలిగి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో వారు అవసరమైన పాయింట్లను చేరుకోలేరు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో 14 కంటే ఎక్కువ పాయింట్లు ఉన్న నాలుగు జట్లు ఉన్నాయి.
20 పాయింట్లతో గుజరాత్ నంబర్ వన్ స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్ 18 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రెండూ తలో 16 పాయింట్లతో ఉన్నాయి. రాజస్థాన్ ఇంకా ఒక్క మ్యాచ్ ఆడాల్సి ఉంది. శుక్రవారం చెన్నైతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడినా 16 పాయింట్లు మాత్రమే సాధించి క్వాలిఫై అయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీ కూడా ముంబైని ఓడిస్తే 16 పాయింట్లు కూడా వస్తాయి. అంటే వీరందరికీ పంజాబ్, హైదరాబాద్ కంటే ఎక్కువ పాయింట్లు ఉంటాయని, ఈ కారణంగా ఈ రెండు జట్లూ గెలిచినా ప్లేఆఫ్‌కు వెళ్లలేవు.
రాజస్థాన్ టికెట్ కూడా ఖాయం..
అదే సమయంలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాజస్థాన్ ప్లేఆఫ్‌కు వెళ్లడం కూడా దాదాపు ఖాయంగా మారింది. చెన్నైతో మ్యాచ్ ఆడాల్సిన రాజస్థాన్ ఈ మ్యాచ్ లో ఓడినా 16 పాయింట్లు మాత్రమే ఉంటాయి. మరోవైపు ముంబైపై ఢిల్లీ ఓడితే 16 పాయింట్లకు చేరుకుంటుంది. ఇటువంటి పరిస్థితిలో, రాజస్థాన్, ఢిల్లీ, బెంగళూరు ఉన్న 16 పాయింట్లతో మూడు జట్లు ఉంటాయి. బెంగళూరు నెట్ రన్ రేట్ ఢిల్లీ, రాజస్థాన్ రెండింటి కంటే అధ్వాన్నంగా ఉండడంతో అది ఔట్ అవుతుంది. ఢిల్లీ, రాజస్థాన్ జట్లు ప్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకుంటాయి.