AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హక్కుల కోసం దిగ్గజ బాక్సర్‌తో పోరాటం.. ఫెడరేషన్ హ్యాండిచ్చినా తగ్గని నైజం.. కట్‌చేస్తే.. చరిత్ర సృష్టించిన తెలంగాణ ముద్దబిడ్డ..

Nikhat Zareen: 2019 అంటే నిఖత్ జరీన్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సంవత్సరంగా నిరూపణ అయ్యింది. ఆ సంవత్సరం ఆమె తన మొదట రింగ్ లోపల అద్భుతమైన ప్రదర్శనతో పతకాలను గెలుచుకుంది. ఆపై వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

హక్కుల కోసం దిగ్గజ బాక్సర్‌తో పోరాటం.. ఫెడరేషన్ హ్యాండిచ్చినా తగ్గని నైజం.. కట్‌చేస్తే.. చరిత్ర సృష్టించిన తెలంగాణ ముద్దబిడ్డ..
Nikhat Zareen
Venkata Chari
|

Updated on: May 20, 2022 | 7:37 AM

Share

భారత బాక్సింగ్‌లో వెలుగులోకి వస్తున్న పేరు నిఖత్ జరీన్(Boxer Nikhat Zareen). తెలంగాణాలోని నిజామాబాద్‌కు చెందిన 25 ఏళ్ల బాక్సర్ చాలా కాలం తర్వాత తాను ఎదురుచూస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆమె IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2022(IBA Women’s World Boxing Championship 2022)లో భారతదేశపు అత్యంత విజయవంతమైన బాక్సర్‌గా నిలిచింది. 52 కేజీల వెయిట్‌ విభాగంలో ఫైనల్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారిగా పాల్గొంటున్న నిఖత్ జరీన్, దిగ్గజ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఎంసీ మేరీకోమ్(MC Mary Kom) బాక్సింగ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగల భారతదేశం తదుపరి ఆశగా నిలిచింది. అయితే, నిఖత్‌కు ఈ వారసత్వాన్ని అంత సులభంగా పొందలేదు. దీని కోసం ఆమె తన స్వంత సీనియర్‌తో పోరాడవలసి వచ్చింది. మొదట రింగ్ వెలుపల, తరువాత రింగ్ లోపల. కారణం- అవకాశంతోపాటు హక్కుల కోసం పోరాడింది.

నిఖత్ జరీన్ గత 4-5 సంవత్సరాలుగా భారత బాక్సింగ్‌లో తన స్థానాన్ని సంపాదించుకుంది. అయితే, ఆమె 11 సంవత్సరాల క్రితం అతిపెద్ద విజయాన్ని సాధించింది. 14 సంవత్సరాల వయస్సులో జూనియర్ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకుంది. అయినా.. సీనియర్ స్థాయిలో ఆమె మొదటి విజయం 2019లో వచ్చింది. ప్రతిష్టాత్మకమైన స్ట్రేంజెర్జా మెమోరియల్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. అదే సంవత్సరం, నిఖత్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది. ఆమె 51-52 కిలోల విభాగంలో సాధించింది. దీని కోసం భారతదేశపు అతిపెద్ద బాక్సర్ మేరీ కోమ్ ఇప్పటికే క్యూలో ముందుంది.

నిఖత్ vs మేరీ కోమ్ మధ్యలో ఫెడరేషన్..

ఇవి కూడా చదవండి

2019లో నిఖత్‌ ఎక్కవగా చర్చల్లో నిలిచింది. స్ట్రేంజ్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో అద్భుత ప్రదర్శన తర్వాత వివాదాల పరంపర మొదలైంది. దాదాపు 6 నెలల పాటు భారతీయ బాక్సింగ్‌పై ఆధిపత్యం చెలాయించిన మేరీకోమ్‌తో పోరాడాల్సి వచ్చింది. ఈ విషయంలో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) కూడా కొన్ని నిర్ణయాలతో వివాదానికి పునాది వేసింది. ఆగస్ట్ 2019లో, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు బాక్సర్‌లను పంపడానికి ట్రయల్స్ జరిగాయి. ఇందులో ప్రతి విభాగంలోని బాక్సర్లు ట్రయల్స్‌లో పాల్గొనవలసి ఉంటుంది. మేరీ కోమ్ 51 కేజీలలో నంబర్ వన్ బాక్సర్‌గా నిలవగా, నిఖత్‌తో సహా మరో ఇద్దరు బాక్సర్లు కూడా పోటీ పడ్డారు.

అయితే, సెలక్షన్స్‌ను నిలిపివేసిన అధికారులు.. మేరీకోమ్‌కి నేరుగా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించారు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటంటే, మేరీ కోమ్ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదని, ఆమె ఛాంపియన్‌షిప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంలూ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అంతా బాగానే ఉంది. కానీ నిబంధనల ప్రకారం ఇది తప్పు. ఇక్కడే నిఖత్ తన గొంతును వినిపించింది. విచారణను డిమాండ్ చేసింది. ఆ సమయంలో బీఎఫ్‌ఐ పట్టించుకోకపోవడంతో మేరీకోమ్ కూడా పట్టించుకోలేదు.

ఛాంపియన్‌షిప్ అక్టోబర్ 2019లో జరిగింది. దీనిలో మేరీ కాంస్యం గెలుచుకుంది. ఇక్కడి నుంచి ఈ వివాదం రెండవ రౌండ్ ప్రారంభమైంది. బీఎఫ్‌ఐ నిర్ణయం మరోసారి దుమారం రేపింది. ముఖ్యంగా ఫెడరేషన్ ప్రెసిడెంట్ అజయ్ సింగ్ ప్రకటన మరోసారి ఆజ్యం పోసింది. అందులో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచిన ఆటగాళ్లు ఒలింపిక్ క్వాలిఫైయర్‌లకు నేరుగా ప్రవేశం పొందుతారంటూ బాంబ్ పేల్చారు. అంటే.. మేరీకోమ్ సహా ఇతర బాక్సర్లను ట్రయల్స్ నుంచి మినహాయించాలని నిర్ణయించారు. అయితే దీనికి కొద్ది రోజుల ముందు, మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, రజతం గెలిచిన వారికి మాత్రమే ట్రయల్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఫెడరేషన్ అధికారిక ప్రకటన చేసింది.

ఇటువంటి పరిస్థితిలో BFI అధ్యక్షుడి ప్రకటన, ఫెడరేషన్ నిబంధనల మధ్య వివాదం ఏర్పడింది. ఇక్కడ మళ్ళీ నిఖత్ తన హక్కుల కోసం పోరాడవలసి వచ్చింది. ఫెడరేషన్ ఈసారి కూడా ట్రయల్స్‌కు తనకు అవకాశం ఇవ్వడం లేదని తెలిసింది. అయితే, ఈసారి ట్రయల్స్‌ను డిమాండ్ చేస్తూ నేరుగా అప్పటి కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాసింది. రిజిజు కూడా ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చివరకు BFI డిసెంబర్ 2019లో ట్రయల్స్ నిర్వహించాల్సి వచ్చింది.

న్యూ ఢిల్లీ ట్రయల్‌కు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మేరీకోమ్‌, నిఖత్‌ను సులభంగా ఓడించింది. అయితే ఆ సమయంలోనూ బరిలోకి దిగిన తర్వాత కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. బౌట్‌లో మేరీ అనుచిత పదజాలం ఉపయోగించారని నిఖత్, ఆమె కోచ్ ఆరోపించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత మేరీకోమ్, నిఖత్‌తో కరచాలనం చేయకపోవడం కూడా అందరూ చూశారు.

రెండున్నరేళ్ల తర్వాత సత్తా చాటిన నిఖత్..

రెండున్నరేళ్ల తర్వాత మరోసారి నిఖత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌తో వార్తల్లో నిలిచిన మేరీతో పోటీపడింది. ఈసారి మాత్రం రింగ్‌లో తన ప్రదర్శనతో దేశానికే వన్నె తెచ్చింది. 39 ఏళ్ల మేరీ ఈసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో యువతకు లభించిన అవకాశాన్ని సాకుగా చూపి వైదొలిగింది. ఇటువంటి పరిస్థితిలో, నిఖత్‌పై భారీగా అంచనాలు నిలిచాయి. ఆమె మూడేళ్ల క్రితం తన పోరాటం ప్రారంభించిన హక్కుల పోరాటం.. తప్పు కాదని నిరూపించింది. ఈ విజయానికి ఆమె కచ్చితంగా అర్హురాలేనని మరోసారి తనను తాను నిరూపించుకుంది.

Also Read: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పతకాలలో తగ్గేదేలే.. సత్తా చాటిన భారత మహిళలు.. 21 ఏళ్లలో ఎన్ని సాధించిందంటే?

IPL 2022: ప్రపంచంలోనే ఇప్పటివరకు ఏ బ్యాట్స్‌మెన్ చేయని రికార్డ్.. కోహ్లీ ఖాతాలో చేరిన అరుదైన ఘనత.. అదేంటంటే?