Viral: రెండు దేశాల మధ్య బయటపడ్డ భారీ సొరంగం.. లోపలికెళ్లి చూసి షాకైన అధికారులు.. ఎందుకంటే?

సరిహద్దులో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను కలిగి ఉన్న రెండు దేశాల మధ్య భారీ సొరంగం వెలుగుచూసింది. అందులో ఉన్న విషయాలను తెలుసుకున్న అధికారులకు కళ్లుబైర్లుకమ్మాయి.

Viral: రెండు దేశాల మధ్య బయటపడ్డ భారీ సొరంగం.. లోపలికెళ్లి చూసి షాకైన అధికారులు.. ఎందుకంటే?
Viral News
Follow us
Venkata Chari

|

Updated on: May 18, 2022 | 5:57 PM

ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎన్నో వార్తలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే, వీటిలో కొన్ని మనకు ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని మాత్రం నిజంగానే షాకిస్తాయి. ఇలాంటి కోవలోకే వచ్చే ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రెండు దేశాల మధ్య ఒక సొరంగం కనుగొన్నారు. అయితే, దానికి పూర్తిగా తవ్వి అసలు అందులో ఏముందోనని తెలుసుకుందామనుకున్నారు. అనుకున్న ప్రకారమే అన్ని ఏర్పాట్లు చేసి, ఆ సొరంగాన్ని తవ్వారు. అలా కొద్దిదూరం ప్రయాణించిన వారికి భారీ షాక్ తగిలింది. దీంతో అవాక్కైన వారు, దానిని ఛేందించే పనిలో పడ్డారు. దీంతో ఈ విషయం నెట్టింటికి చేరి, సందడి చేస్తోంది. ఇది అమెరికా-మెక్సికో సరిహద్దులో జరిగింది. ఈ సొరంగంలో ఓ రైల్వే లైన్, అందుకోసం విద్యుత్ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కనుగొన్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం నేరస్థులు ఈ సొరంగాన్ని సిద్ధం చేసినట్లు అధికారులు కనుగొన్నారు.

Also Read: Viral News: ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చిన తల్లి.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఈ సొరంగం నుంచి కొకైన్‌, హెరాయిన్‌, మెథాంఫెటమైన్‌ వంటి అనేక మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. DailyMail నివేదిక ప్రకారం, స్మగ్లింగ్ కోసం ఉపయోగించే ఈ సొరంగాన్ని యూఎస్ అధికారులు ఎట్టకేలకు కనుగొన్నారు. దీంతో అసలు విషయం తెలిసి, అంతా షాకవుతున్నారు. ఈ సొరంగం మెక్సికోలోని టిజువానా, అమెరికాలోని శాన్ డియాగో మధ్య ఉంది. టన్నెల్‌లో రైలు, విద్యుత్ లాంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సొరంగంలో వెంటిలేషన్ కూడా పుష్కలంగా ఉంది. అదే సమయంలో రికవరీ చేసిన డ్రగ్ విలువ దాదాపు రూ.193 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది.

ఈ సొరంగం పొడవు 1744 అడుగులు, లోతు 61 అడుగులు అని హోంల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించిన ఏజెంట్లు సోమవారం ప్రకటించారు. శాన్ డియాగోలోని ఓటే మీసా సరిహద్దు క్రాసింగ్ సమీపంలో శుక్రవారం సొరంగం కనుగొన్నట్లు వారు తెలిపారు. గత రెండు దశాబ్దాలలో డజనుకు పైగా సొరంగాలను ఇదే ప్రాంతంలో కనుగొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ సొరంగం ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది, డ్రగ్స్ స్మగ్లింగ్ ఎప్పటి నుంచి జరుగుతుందో పేర్కొనలేదు. ఈ దాడుల్లో 799 కిలోల కొకైన్, 75 కిలోల మెత్, 1 కిలో 600 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అసలు సొరంగం గురించి ఎలా తెలిసిందంటే?

సాయుధ గార్డు మొదట ఇద్దరు అనుమానితులను ఆ సొరంగం ప్రాంతంలో చూశాడు. ఓ ఇంటి నుంచి కారులో దిగారు. ఆ తర్వాత వారు గిడ్డంగికి వెళ్లారు. ఈ గిడ్డంగిని పరిశోధించగానే, ఒక సొరంగం విషయం వెలుగులోకి వచ్చిందని యుఎస్ అటార్నీ రాండీ గ్రాస్‌మన్ తెలిపారు. టిజువానా-శాన్ డియాగో ప్రాంతంలో కనుగొన్న 91వ సొరంగంగా అధికారులు ప్రకటించారు. 1993 నుంచి అమెరికా, మెక్సికో సరిహద్దులో దాదాపు 272 సొరంగాలు కనుగొన్నారు. టిజువానా (మెక్సికో)లో 4,309 అడుగుల ఎత్తులో పొడవైన సొరంగాన్ని జనవరి 2020లో కనుగొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Viral Video: పెళ్లికూతురు ఏ మాత్రం తగ్గలేదు.. ‘నాటు నాటు’ పాటకు హీటెక్కించే స్టెప్పులు

Optical Illusion: ఈ గబిబిజి ఫోటో మీ అంతరాత్మను పసిగట్టేస్తుంది.. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ ఫోటోపై లుక్కేయాల్సిందే..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..