AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో! బంగారాన్ని ఇలా కూడా దొంగలిస్తారా? ఈ కి’లేడీ’ ఐడియాను చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

Viral Video: ఇందులో నగల దుకాణానికి వచ్చిన ఒక మహిళ బంగారు ఆభరణాలను దొంగలించడం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

Viral Video: వామ్మో! బంగారాన్ని ఇలా కూడా దొంగలిస్తారా? ఈ కి'లేడీ' ఐడియాను చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..
Basha Shek
|

Updated on: May 18, 2022 | 6:20 PM

Share

Viral Video:  సోషల్ మీడియాలో నిత్య రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే, మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య దొంగతనాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో ఒకటి సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో నగల దుకాణానికి వచ్చిన ఒక మహిళ బంగారు ఆభరణాలను దొంగలించడం చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వివరాల్లోకి వెళితే .. జ్యువెలరీ షాపు కొచ్చిన ఇద్దరు మహిళలను కూర్చోబెట్టి బంగారు ఆభరణాలను చూపిస్తూంటాడు సేల్స్‌ మ్యాన్‌. కాగా నల్లటి వస్త్రాలు ధరించిన ఓ మహిళ షాపు వాడు అందించిన నెక్లెస్‌లు చిన్న బంగారు ఆభరణాలను చూస్తుంటుంది. అయితే ఆ సేల్స్‌ మ్యాన్‌ ఇతర కస్టమర్లతో మాట్లాడుతూ బిజీగా మారిపోతాడు. ఇదే అదనుగా తీసుకున్న ఆ మహిళ సేల్స్‌ మ్యాన్‌ కళ్లు గప్పి ఓ బంగారు ముక్కను నోటిలో పెట్టుకుంది. అయితే ఆ మహిళ బంగారాన్ని మింగేసిందా.. లేక కేవలం నోటిలో దాచుకుందా అన్నది ఈ వీడియోలో తెలియడం లేదు.

నగల కోసం ప్రాణాలు పోగొట్టుకుంటావా?

ఇవి కూడా చదవండి

అయితే ఇది ఎక్కడ జరిగిందో కానీ memes.bks అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. బంగారం దొంగలించడానికి ఆమె ఎంచుకున్న ఐడియాను చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే బంగారం గొంతులో ఇరుక్కున్నా, మింగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటూ నెటిజన్లు హెచ్చరిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నగల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ సూచిస్తున్నారు. మరి ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోన్న ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

View this post on Instagram

A post shared by BKS ?? (@memes.bks)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Dental Health: దంతాలు మెరవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే.. లిస్టులో టీ, కాఫీలతో పాటు..

Suriya: జైభీమ్‌ సినిమాను వెంటాడుతోన్న వివాదాలు.. సూర్య దంపతులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు..

Malaika Arora and Arjun Kapoor: త్వరలోనే ఏకం కానున్న లవ్‌బర్డ్స్‌.. మలైకా, అర్జున్‌ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌!