CM KCR: ఇది చిల్లర వ్యవహారం.. కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్..

రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే

CM KCR: ఇది చిల్లర వ్యవహారం.. కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్..
Follow us

|

Updated on: May 18, 2022 | 5:23 PM

కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(CM KCR) విరుచుకుపడ్డారు. పల్లెలకు కేంద్రం నేరుగా నిధులివ్వడం చిల్లర వ్యవహారమని అన్నారు. స్థానిక పరిస్థితులు రాష్ట్రాలకే తెలుస్తాయి. సీఎం కేసీఆర్ సమీక్షప్రగతి భవన్‌లో పల్లె, పట్టణ ప్రగతి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరుగుతోంది. ఢిల్లీ నుంచి కేంద్రమే నిధులు పంచడం సరికాదన్నారు. దేశంలో ఇంకా కరెంట్ లేని పల్లెలు ఉన్నాయన్నారు. తాగు, సాగునీరు లేక ప్రజలు కష్టాలు పడుతున్నారు. కేంద్రం ఇలాంటి విషయాలపై దృష్టిపెట్టాలని సూచించారు. రాష్ట్రాల విధుల్లో కేంద్ర జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ప్రస్తుతం దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ ఉందన్నారు. పల్లెలు, పట్టణాలను అభివృద్ది చేసుకుంటున్నామన్నారు. మనం చేస్తున్న పనిని ఇతరులు గుర్తించడమే ప్రగతికి కొలమానమనీ.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు, ఆదరణ లభించడం పట్ల  హర్షం వ్యక్తం చేశారు.

రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమని అన్నారు. ఈ దిశగా కృషి చేసిన పంచాయతీ రాజ్ శాఖను, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావును సీఎం కేసీఆర్ అభినందించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, స్థానికసంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, నగరపాలికల మేయర్లు, కమిషనర్లతో ప్రగతిభవన్​లో సమావేశం అయ్యారు.

ధాన్యం సేకరణ, వైకుంఠధామాలు, మార్కెట్ల నిర్మాణం, ప్రకృతి వనాల అభివృద్ధిపై చర్చిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించనున్నారు.ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో దఫా పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇప్పటి వరకు నిర్వహించిన పల్లె,పట్టణప్రగతి అమలు, పురోగతిని కేసీఆర్ సమీక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అందులో చేపట్టిన పనులు, వాటి పురోగతి, పారిశుద్ధ్య నిర్వహణ, తదితరాలపై పూర్తి స్థాయిలో చర్చిస్తారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మరో విడత కార్యక్రమాల నిర్వహణ, ప్రణాళికపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు.