Viral Video: జర్నీ సినిమా రిపీట్.. రెండు బస్సులు ఢీ.. ఒళ్లుగగుర్బోడిచే వీడియో..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: May 18, 2022 | 12:56 PM

Bus Accident in Salem: రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. ఢీకొన్న దృశ్యాలు బస్సులో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ..

Viral Video: జర్నీ సినిమా రిపీట్.. రెండు బస్సులు ఢీ.. ఒళ్లుగగుర్బోడిచే వీడియో..
Bus Accident In Salem

తమిళనాడులోని(Tamil Nadu) సేలం జిల్లాలో(Salem District) రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో(Buses Collided) 30 మంది గాయపడ్డారు. ఢీకొన్న దృశ్యాలు బస్సులో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో(Viral Video) చాలా భయానకంగా ఉంది. మే 17.. మంగళవారం సాయంత్రం ఎడప్పాడి నుంచి ముప్పై మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు తిరుచెంగోడ్ నుంచి వస్తున్న మరో ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఢీకొనడంతో ఒక్క సెకను వ్యవధిలో బస్సు డ్రైవర్ సీటుపై నుంచి ఎలా కిందపడ్డాడో సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. ఢీకొన్న సమయంలో బస్సు ముందు భాగం ఎలా దెబ్బతింది అనేది కూడా వీడియోలో చూపించారు. ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం 30 మంది ప్రయాణికులు గాయపడి ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ప్రమాదంలో దెబ్బతిన్న బస్సుకు ఎదురుగా మరో బస్సు రాంగ్ లేన్‌లో రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొనడం వల్ల బస్సులోని చాలా మంది అద్దాల పగలి మీద పడిపోయారు.

వైరల్ వీడియోలో బస్సు డ్రైవర్ తన లేన్‌లో ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు.. ఎదురుగా వచ్చిన బస్సు రాంగ్ లేన్‌లోకి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో బస్సు డ్రైవర్, కండక్టర్, మరొక ప్రయాణీకుడు బస్సు యొక్క విండ్ షీట్‌ను ఢీకొట్టారు. అది అద్దం పగులడంతో డ్రైవర్ తలకు చిన్నపాటి గాయం మాత్రమే అయ్యింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu