Banks Privatization: ఆ రెండు బ్యాంకులను ప్రైవేటుపరం చేయనున్న కేంద్రం.. వేగంగా కొనసాగుతున్న ప్రక్రియ..

Banks Privatization: ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. గతంలో ప్రభుత్వ రంగంలో(Public sector) ఉన్న కంపెనీలను అమ్మాలని తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

Banks Privatization: ఆ రెండు బ్యాంకులను ప్రైవేటుపరం చేయనున్న కేంద్రం.. వేగంగా కొనసాగుతున్న ప్రక్రియ..
Banks Privatization
Follow us

|

Updated on: May 18, 2022 | 12:46 PM

Banks Privatization: ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. గతంలో ప్రభుత్వ రంగంలో(Public sector) ఉన్న కంపెనీలను అమ్మాలని తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి నష్టాలు తెచ్చిపెడుతున్న ఎయిర్ ఇండియాను టాటాలకు అమ్మిన కేంద్రం అదే దూకుడును కొనసాగిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటికే అనుకున్నట్లుగా విజయవంతంగా ఎల్ఐసీ ఐపీవోను(LIC IPO) మార్కెట్లోకి తీసుకొచ్చి డబ్బును సమీకరించింది. దీనికి తోడు ఇంధన వ్యాపారంలో ఉన్న హెచ్పీసీఎల్ లో వాటాలను అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

వీటికి తోడు బ్యాంకులను సైతం ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తోంది. కానీ సదరు బ్యాంకుల ఉద్యోగులు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి అడ్డంకుల వల్లనే ప్రైవేటీకరణ ప్రక్రియ ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. ప్రైవేటీకరణకు అవసరమైన శాసన ప్రక్రియ పూర్తయ్యాక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇదే అంశంపై కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలోనూ ప్రస్తావించారు. రెండు బ్యాంకులతో పాటు, ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సైతం ప్రైవేటీకరించే యోచనలో ఉన్నట్లు ఆమె అన్నారు. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు ప్రైవేటు పరం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ ఇప్పటికే ప్రైవేటీకరించాల్సిన బ్యాంకులను గుర్తించినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి