AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నెంబర్ ప్లేట్లు మార్చేస్తున్నారు.. యథేచ్ఛగా రోడ్లపై తిరగేస్తున్నారు

హైదరాబాద్(Hyderabad) లో బైక్ నడిపేవారు రెచ్చిపోతున్నారు. అతివేగం, వెకిలిచేష్టలు వంటి చర్యలతో ఇబ్బంది పెట్టిన కొందరు యువకులు.. ఇప్పుడు తప్పుడు నంబర్ ప్లేట్లతో ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పి తెప్పిస్తున్నారు.....

Hyderabad: నెంబర్ ప్లేట్లు మార్చేస్తున్నారు.. యథేచ్ఛగా రోడ్లపై తిరగేస్తున్నారు
Hyderabad Traffic
Ganesh Mudavath
|

Updated on: May 18, 2022 | 2:47 PM

Share

హైదరాబాద్(Hyderabad) లో బైక్ నడిపేవారు రెచ్చిపోతున్నారు. అతివేగం, వెకిలిచేష్టలు వంటి చర్యలతో ఇబ్బంది పెట్టిన కొందరు యువకులు.. ఇప్పుడు తప్పుడు నంబర్ ప్లేట్లతో ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పి తెప్పిస్తున్నారు. ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కేటాయించిన నంబర్ కాకుండా ఇతర వాహనాల నంబర్లతో యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. రవాణా శాఖ కేటాయించిన రిజిస్ట్రేషన్‌ నంబరు బదులు ఇతరుల వాహనాల నంబర్లు అతికించుకుని దర్జాగా రోడ్ల మీద తిరుగుతున్నారు. వీరికి ట్రాఫిక్ పోలీసులు విధించే చలానాలు అసలైన వెహికిల్ నంబర్ కలిగిన వారికి వెళ్తున్నాయి. మోటారు వాహన చట్టం ప్రకారం వాహనానికి బోగస్‌ లేదా తప్పుడు నంబరు ప్లేట్లు వినియోగించడం చట్టరీత్యా నేరం. పోలీసులకు క్రిమినల్‌ కేసులు నమోదు చేసే అధికారమూ ఉంది. రవాణా శాఖ సహాయంతో వాహనాన్ని నడిపే వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తారు. ఇలా ఇతర వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబరు వినియోగించడం, అక్షరాలు గజిబిజిగా చేసినవి నగరంలో దాదాపు రెండు వేల వరకూ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

అవి కూడా దాదాపు ద్విచక్ర వాహనాలే. తమ వాహన రిజిస్ట్రేషన్‌ నంబరును ఇతరుల వాహనాలకు వినియోగించినట్లు అనుమానం వస్తే తప్పనిసరిగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు సీసీ కెమెరాలు, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తప్పుడు నంబరు వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ఈ ఛలానా వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

CM KCR: పల్లెలకు నేరుగా నిధులివ్వడం చిల్లర వ్యవహారం.. కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్..

Follow Us
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు