- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips For Money Plant Never do these mistakes while planting money plant at home
Money Plant Vastu Tips: ఇంట్లో మనీ ప్లాంట్ పెడుతున్నారా? అయితే, ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు..!
Money Plant Vastu Tips: వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. వీటిలో మనీ ప్లాంట్ ఒకటి. ఈ మొక్కను ఇంట్లో నాటడం..
Updated on: May 18, 2022 | 6:00 PM

Money Plant Vastu Tips: వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. వీటిలో మనీ ప్లాంట్ ఒకటి. ఈ మొక్కను ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే దీన్ని నాటేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మనీ ప్లాంట్‌ను ఇంట్లో నాటే ముందు.. ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ దిశలో మనీ ప్లాంట్ పెట్టవద్దు: మనీ ప్లాంట్ సరైన దిశలో ఉండాలి. దీనిని ఆగ్నేయ దిశలో అంటే అగ్ని కోణంలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈశాన్యం ఉంచవద్దు. ఇది ఇంట్లో నివసించే సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మనీ ప్లాంట్‌ను ఇంటికి పడమర, తూర్పు దిక్కులలో పెట్టకూడదు.

నేలను తాకవద్దు: మనీ ప్లాంట్ చాలా వేగంగా పెరుగుతుంది. దాని తీగను తాడుతో పైకి కట్టాలి. వాస్తు ప్రకారం, ఇది పురోగతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మనీ ప్లాంట్ నేలను తాకనివ్వవద్దు.

మనీ ప్లాంట్ ఎండిపోవద్దు: మనీ ప్లాంట్ ఎండిపోవడం దురదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఆకులు ఎండిపోతే, వాటిని తొలగించండి.

ఇతరుల ఇంటి నుండి మనీ ప్లాంట్ తీసుకోవద్దు: ఒకరి ఇంటి నుండి మనీ ప్లాంట్‌ను తీసుకువచ్చి మీ ఇంట్లో నాటవద్దు. అలాగే మీ మనీ ప్లాంట్‌ను ఎవరికీ ఇవ్వొద్దు. వాస్తు ప్రకారం ఇలా చేయడం తప్పుగా పరిగణించబడుతుంది.




