- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips in telugu get rid of marriage problems with planting rajnigandha plant
Vastu Tips: భార్యాభర్తల మధ్య విబేధాలా.. ఇంట్లో ఈ దిశలో రజినిగంధను పెంచుకోండి..
Vastu Tips: ఇంట్లో మొక్కలు అందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. అయితే కొన్ని మొక్కలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా రజనీగంధ మొక్క ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తున్నారు. దీనినే ట్యూబురోస్ అని కూడా అంటారు. అయితే ఈ మొక్కను వాస్తు శాస్త్రంలో ప్రత్యేక దిశలో పెంచాలని సూచిస్తున్నారు.
Updated on: May 19, 2022 | 11:51 AM

ఇంటి అందాన్ని పెంపొందించేందుకు, పరిసరాలను శుద్ధి చేసేందుకు ఇంట్లో ఎన్నో మొక్కలను పెంచుతారు. ఇవి ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా వీటికి ప్రాధాన్యత ఉంది. వీటిలో ఒకటి ట్యూబెరోస్ మొక్క. దీన్ని ఇంట్లో పెట్టుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

ఇంట్లో రజనీగంధ మొక్కను నాటడం ద్వారా.. సానుకూల శక్తి ప్రసారం చేయబడుతుంది. ఇది ప్రతికూలతను తొలగిస్తుంది. ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి.

వాస్తు శాస్త్రంలో అనేక రకాల మొక్కలున్నాయి. కొన్ని మొక్కలు సానుకూల శక్తిని ప్రసారం చేస్తాయి. కొన్ని మొక్కలు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. ట్యూబురోస్ మొక్కను ఇంటికి ఉత్తర దిశలో పెంచుకోవాలి. దీనివలన ఇంట్లోని కుటుంబ సభ్యులు జీవితంలో ఎంతో పురోభివృద్ధి సాధిస్తారు.

భార్యాభర్తల మధ్య దృఢమైన సంబందానికి రజనీగంధకు విశేషస్థానం ఉంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య తగాదాలు, విభేదాలు ఉన్నట్లయితే.. ఈ మొక్కను నాటడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి ప్రాంగణంలో రజనీగంధను పెంచడం వలన భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.

మీరు ఇంట్లో ఉత్తర లేదా తూర్పు దిశలో ట్యూబురోస్ మొక్కను నాటవచ్చు. ఇది ఇంట్లో సంతోషాన్ని సంపదను తెస్తుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.




