- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti If you want to save humanity, then never show off in these 4 things Know the Details
Chanakya Niti: మీలోని మానవత్వాన్ని నిలుపుకోవాలంటే.. ఈ నాలుగు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి..
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవత్వానికి సంబంధించి నాలు అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు. ఆ నాలు అంశాల విషయంలో సహజంగా ఉంటే.. మీలోని మానవత్వం ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందని హితవుపలికారు.
Updated on: May 20, 2022 | 9:37 AM

ఆచార్య చాణక్యుడు జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించి తన అభిప్రాయాలను చెప్పారు. ఆచార్య గారి ఈ ఆలోచనలు మనందరికీ చాలా ఉపయోగపడతాయి. ఒక వ్యక్తి జీవితంలో ఈ ఆలోచనలను పాటిస్తే.. తన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

చాకచక్యం లేని వ్యక్తి ఎవరితోనైనా మాట్లాడటానికి, చెప్పడానికి వెనుకాడడు. మెల్లమెల్లగా అతని సొంతం అనేది కూడా అతని నుంచి దూరం కావడం మొదలవుతుంది. అలాంటి వారితో కలిసి జీవించడం వల్ల మీ ప్రవర్తన చెడుగా, ప్రతికూలంగా మారుతుంది.

డబ్బు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఆచార్య చాణక్యుడు దేశాన్ని నడపడానికి డబ్బు అవసరమని చెప్పాడు. డబ్బు ఒక్కటే ఎంతో శక్తి వంతమైంది. డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో.. అతనికి బంధువులు ఉంటారు, సమాజంలో ప్రతిష్ట ఉంటుంది. అతను పండితుడు, తెలివైనవాడు, యోగ్యుడుగా పరిగణించబడ్డాడు.

క్రమశిక్షణ లేని వ్యక్తి ఎప్పుడూ ఇబ్బంది పడతాడని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. అతను తనను తాను బాధించుకోవడమే కాదు, ఇతరులను కూడా బాధపెడతాడు. అలాంటి వ్యక్తి ఎప్పుడూ సమాజ నియమాలను ఉల్లంఘిస్తూ ఇతరులకు ఇబ్బందులు సృష్టిస్తాడు.

కోపం మరణాన్ని ఆహ్వానిస్తుంది.. దురాశ దుఃఖాన్ని ఆహ్వానిస్తుంది. కానీ విద్య.. పాలు ఇచ్చే ఆవు లాంటిది. ఇది ఎల్లప్పుడూ వ్యక్తికి ప్రాణం పోస్తుంది. అంతేకాదు కాకుండా, సంతృప్తిని కలిగిన వ్యక్తి, ప్రపంచంలో ఎక్కడైనా తన జీవితాన్ని అత్యంత సులభంగా గడుపుతాడు.




