Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: బన్నీ ఫ్యాన్స్‌కు ఎదురు చూపులు తప్పేలా లేవుగా.. మరింత ఆలస్యం కానున్న పుష్ప సీక్వెల్‌.?

Pushpa 2: అల్లు అర్హున్‌ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ను ఒక్కసారిగా షేక్‌ చేసింది...

Pushpa 2: బన్నీ ఫ్యాన్స్‌కు ఎదురు చూపులు తప్పేలా లేవుగా.. మరింత ఆలస్యం కానున్న పుష్ప సీక్వెల్‌.?
Pushpa Moive
Follow us
Narender Vaitla

|

Updated on: May 18, 2022 | 1:49 PM

Pushpa 2: అల్లు అర్హున్‌ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ను ఒక్కసారిగా షేక్‌ చేసింది. దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్లను రాబట్టి తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా రానున్న పుష్ప సీక్వెల్‌ అయిన ‘పుష్ప ది రూల్‌’పై అందరి దృష్టి పడింది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ సిండికేట్‌కు డాన్‌లా ఎదిగిన పుష్పరాజ్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు లాంటి అంశాలతో రానున్న పార్ట్‌2 పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక పెరిగిన ఈ అంచనాలతో దర్శకుడు సుకుమార్‌పై ఒత్తిడి కూడా బాగానే పెరిగింది. సీక్వెల్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే క్రమంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని తెలుస్తోంది. నిజానికి పుష్ప సీక్వెల్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఇప్పట్లో అది సాధ్యం కాదని తెలుస్తోంది. ఇంకా సినిమా షూటింగ్‌ పూర్తి కాకపోవడం, చిత్ర యూనిట్‌ కూడా సినిమా విడుదల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పుష్ప సీక్వెల్‌ మరింత ఆలస్యం కానుందన్న వార్తలకు బలం చేకూరింది.

ఇదిలా ఉంటే పుష్ప తొలి పార్ట్‌ విషయంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ను చాలా వేగంగా పూర్తి చేశారు. అయితే ఈసారి మాత్రం అలా కాకుండా ఎక్కువ సమయం తీసుకొని మరింత క్వాలిటీ అవుట్‌పుట్‌ ఇవ్వాలని సుకుమార్‌ భావిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకే ఏకంగా 4 నెలల సమయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పుష్ప సీక్వెల్‌ ఆలస్యానికి ఇది కూడా ఓ కారణమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే పుష్ప సీక్వెల్ వచ్చే ఏడాది సమ్మర్ నాటికి గానీ రాదన్నమాట. మరి ఇండస్ట్రీలో జరుగుతోన్న ఈ చర్చలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..