- Telugu News Photo Gallery Cricket photos IPL 2022: Mumbai Indians bowler Jasprit Bumrah becomes first Indian fast bowler to pick 250 wickets in T20 cricket
IPL 2022: బుమ్రా ఖాతాలో స్పెషల్ రికార్డ్.. ఆ లిస్టులో చేరిన తొలి పేస్ బౌలర్..
IPL 2022లో జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్‌లలో 12 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో అతను ముంబై ఇండియన్స్ తరపున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.
Updated on: May 18, 2022 | 2:37 PM

టీమ్ ఇండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2022 చివరి రౌండ్‌లో అద్భుతంగా రాణించాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడిన బుమ్రా ఈ సీజన్‌లో సరిగ్గా ఆడలేదు. మొత్తం ముంబై ఇండియన్స్ జట్టులా అతను కూడా కష్టపడుతున్నాడు. అయితే, ప్రస్తుతం అతను తన మార్క్‌ను చూపించడం ప్రారంభించాడు. కాగా, టీ20 ఫార్మాట్‌లో భారతదేశం తరపున అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్‌గా మారాడు.

మే 17, మంగళవారం వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ప్రత్యేక విజయం సాధించాడు. టీ20 క్రికెట్‌లో 250 వికెట్లు తీసిన తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.

ఇన్నింగ్స్ 20వ ఓవర్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్‌ను బౌల్డ్ చేయడం ద్వారా బుమ్రా 250 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 205 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అతని తర్వాత 223 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ నిలిచాడు.

ఈ ఫార్మాట్‌లో భారతదేశం తరపున అత్యంత విజయవంతమైన బౌలర్ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. అశ్విన్ 275 ఇన్నింగ్స్‌ల్లో 274 వికెట్లు తీశాడు. 271 వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్ అతనికి చేరువలో ఉన్నాడు.

ఈ సీజన్‌కు సంబంధించినంత వరకు, బుమ్రా తన జట్టులో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా 13 మ్యాచ్‌ల్లో 29 సగటుతో 12 వికెట్లు తీశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కేవలం 10 పరుగులకే 5 వికెట్లు తీశాడు.





























