Viral Video: క్లాసు రూములో డ్యాన్సులు..టీచర్‌కే స్టెప్పులు నేర్పిన స్టూడెంట్‌..నెటజన్స్ ఫిదా

క్లాసు రూముల్లో తప్పస్సు చేయుట వేస్ట్‌రా గురూ..! అన్నది ఏదో సినిమాలోని పాట..కానీ, ఇప్పుడు క్లాసు రూములో డ్యాన్స్‌ చేయుట రిలాక్స్‌రా గురూ అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే, ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Viral Video: క్లాసు రూములో డ్యాన్సులు..టీచర్‌కే స్టెప్పులు నేర్పిన స్టూడెంట్‌..నెటజన్స్ ఫిదా
Teachers Dance
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 18, 2022 | 6:30 PM

క్లాసు రూముల్లో తప్పస్సు చేయుట వేస్ట్‌రా గురూ..! అన్నది ఏదో సినిమాలోని పాట..కానీ, ఇప్పుడు క్లాసు రూములో డ్యాన్స్‌ చేయుట రిలాక్స్‌రా గురూ అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే, ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. దేశ రాజధాని హస్తినలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచర్‌ పిల్లలతో కలిసి సరదాగా చేసిన డ్యాన్స్‌ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. క్లాస్‌ టీచర్‌ విద్యార్థులతో కలిసి డ్యాన్స్‌ చేయటం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. లక్షల్లో వ్యూస్‌,లైకులతో నెట్టింట వీడియో దూసుకుపోతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

ఢిల్లీలోని ఓ ప్రభుత్వం స్కూల్లో పనిచేస్తున్న టీచర్‌ మను గులాటి తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. మై స్కూల్ మై ప్రైడ్ అనే హ్యాష్ ట్యాగ్ తో టీచర్ ట్వీట్ చేశారు. విద్యార్థులకు ఇంగ్లీస్‌ పాఠాలు నేర్పించే టీచర్‌ మను..క్లాస్‌ ముగియగానే పిల్లలతో కాసేపు సరదాగా డ్యాన్స్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలుత ఓ విద్యార్థిని ఓ సాంగ్‌పై డ్యాన్స్‌ చేస్తుండగా టీచర్‌ ప్రోత్సహించారు. అయితే, అక్కడి పిల్లల్లో ఒకరు టీచర్‌కు స్టెప్పులు నేర్పించాలని కోరారు. అది విన్న టీచర్‌ పక్కనే డ్యాన్స్‌ చేస్తున్న విద్యార్థినిని అనుకరిస్తూ స్టెప్పులు వేశారు. దీంతో విద్యార్థులంతా చప్పట్లతో హోరెత్తించారు. టీచర్‌ను మరింతగా ఉత్సాహపరిచారు. ఇదంతా వీడియో తీసిన తోటి ఉపాధ్యాయులు వీడియో తీశారు. మను ట్విట్‌ చేసిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని ప్రోత్సహించేలా చేస్తున్నారంటూ…ఆమె కృషిని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ కథనాలు చదవండి..