TikTok: టిక్‌టాక్‌ పిచ్చి..బ్యాగ్రౌండ్ లో ఎఫెక్ట్ కోసం అడవికి నిప్పుపెట్టిన యువతి..చురకలేస్తున్న నెటిజన్లు

ప్రపంచమంతా స్మార్ట్‌ ఫోన్ల వెంటే పరిగెడుతోంది. అరచేతిలో మొబైల్‌ఫోన్‌ ఉంటే చాలు అరక్షణంలో ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. విచ్చలవిడి సోషల్‌ మీడియా వినియోగంతో అందరూ బిజీగా మారిపోతున్నారు. అడ్డదిడ్డమైన యాప్‌లతో

TikTok: టిక్‌టాక్‌ పిచ్చి..బ్యాగ్రౌండ్ లో ఎఫెక్ట్ కోసం అడవికి నిప్పుపెట్టిన యువతి..చురకలేస్తున్న నెటిజన్లు
Pakistani Tiktoker
Follow us
Jyothi Gadda

|

Updated on: May 18, 2022 | 1:51 PM

ప్రపంచమంతా స్మార్ట్‌ ఫోన్ల వెంటే పరిగెడుతోంది. అరచేతిలో మొబైల్‌ఫోన్‌ ఉంటే చాలు అరక్షణంలో ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. విచ్చలవిడి సోషల్‌ మీడియా వినియోగంతో అందరూ బిజీగా మారిపోతున్నారు. అడ్డదిడ్డమైన యాప్‌లతో అడ్డగోలు వీడియోలు,సెల్ఫీలు, డబ్‌ స్మాషన్లు, పిచ్చి పిచ్చి డ్యాన్సులు, టిక్‌టిక్‌ వీడియోలతో కొందరు పిచ్చి పొకడలు పోతున్నారు. చిత్ర విచిత్రమైన ఫీట్లు చేస్తూ వెరైటీ కోసమంటూ అనేక వెర్రీవేశాలు వేస్తున్నారు. పబ్లిసిటీ కోసం చేసే ఫీట్లు, అరాచకాలు ఒక్కోసారి శ్రుతి మించుతున్నాయి. తమ ప్రాణాలే కాదు, ఎదుటి వారిని సైతం ఇరకటంలో పడేసేలామారుతోంది పరిస్థితి. తాజాగా ఓ పాకిస్థానీ సోషల్‌ మీడియా స్టార్‌ చేసిన నిర్వాకంతో ఏకంగా ఓ పెద్ద అడవికే అగ్గిరాజుకుంది. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. ఆ నటి చేసిన స్టంట్స్‌ ఇంటర్‌ నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.

లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ఓ పాకిస్థానీ సోషల్ మీడియా స్టార్‌ అడవిలో మంటలు చెలరేగుతున్న టిక్‌టాక్‌ వీడియోకు ఫోజులిచ్చి నెటిజన్లతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కేవలం పదిహేను సెకన్ల టిక్ టాక్ వీడియో కోసం ఏకంగా అడవినే తగలబెట్టింది. అంతే కాదు, తనేదో గొప్ప పనిచేసినట్టుగా ఆ వేడి సెగల్లో నుంచి నడుస్తూ వీడియోకు పోజులిస్తూ నెటిజన్ల ఆగ్రహనికి గురైంది.. హుమైరా అస్గర్ అనే యువతి సిల్వర్ బాల్ గౌనులో కాలుతున్న అడవి కొండల నడుమ సరదాగా నడుస్తున్న వీడియో క్లిప్‌ను తన సోషల్‌ మీడియాలో షేర్‌చేసింది. దానికి ఇలా ఓ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. “నేను ఎక్కడ ఉన్నా .. అక్కడ మంటలు చెలరేగుతాయి” అనే ట్యాగ్ ను జత చేసింది. ఇటీవల వచ్చిన అల్లు అర్జున్‌ సినిమా పుష్ప దీ ఫైర్‌ అన్నట్టుగా జస్ట్‌ బ్యాగ్రౌండ్ లో ఎఫెక్ట్ కోసం ఉద్దేశపూర్వకంగా అడవికి నిప్పు పెట్టించింది. దాంతో పోలీసులు కూడా వారి తిక్క కుదిర్చారు. అలా అడవికి నిప్పు పెట్టినందుకు గానూ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. కానీ, నెటిజన్లు మాత్రం బాగా సీరియస్‌ కామెంట్‌ చేస్తున్నారు. వినాశనానికి కారకురాలంటూ యువతిపై మండిపడుతున్నారు.