AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: బాబోయ్…ఆ ఇంటి వరండాలో షాకింగ్‌ సీన్‌..సంతానోత్పత్తి కోసం వచ్చిన మూడు జతల పైథాన్‌లు..

పాములను చుస్తే నిద్రలో కూడా ఉలిక్కి పడి లేస్తాము. అదే ఓ భారీ పైథాన్‌ ఎదురుపడితే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఒకటికాదు రెండు కాదు నాలుగు పైథాన్లు ఒకేసారి కంటపడితే..

Viral video: బాబోయ్...ఆ ఇంటి వరండాలో షాకింగ్‌ సీన్‌..సంతానోత్పత్తి కోసం వచ్చిన మూడు జతల పైథాన్‌లు..
Pythons
Jyothi Gadda
|

Updated on: May 18, 2022 | 3:36 PM

Share

పాములను చుస్తే నిద్రలో కూడా ఉలిక్కి పడి లేస్తాము. అదే ఓ భారీ పైథాన్‌ ఎదురుపడితే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఒకటికాదు రెండు కాదు నాలుగు పైథాన్లు ఒకేసారి కంటపడితే.. ఇక గుండె ఆగిపోయినంత పనవుతుంది. కానీ, ఆస్ట్రేలియాలోని ఓ ఇంటి వరాండలో ఏకంగా నాలుగు భారీ పైథాన్‌లు ప్రత్యక్షమయ్యాయి. కేవలం నాలుగు మాత్రమే కాదు, రెండు వారాల వ్యవధిలో ఆరు పైథాన్లు కనిపించాయి. పైగా అవి రెండు జతలుగా వచ్చి వారింటి వరాండలో సంతానోత్పత్తి జరుపుకుంటున్నట్టుగా ఆ ఇంటి యజమాని గుర్తించారు. వాటికి ఏమాత్రం హానీ చేయకుండా, బయటకు పంపించేశాడు. పైగా ఇదంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త వైరల్‌ అవుతోంది.

ఆస్ట్రేలియాలోని బుడెరిమ్‌లో ఓ ఇంటి బాల్కనీలో ముందుగా ఓ భారీ కొండ చిలువల జంట కనిపించింది. దాన్ని చూసిన ఆ ఇంటి యజమాని ఒకింత షాక్‌ అయ్యాడు. బాల్కనీ రెలింగ్‌పై అల్లుకుని కనిపించిన భారీ పైథాన్‌ ఎండలో చలికాచుకుంటున్నట్టుగా పడుకుని కనిపించాయి. అంతలోనే అవి మెల్లిగా అక్కడ్నుంచి వెళ్లిపోయాయి. . ఆ తర్వాత చూస్తే, ఇంటి డైనింగ్‌ టేబుల్‌ వద్ద మరో జంట కనిపించింది. డైనింగ్‌ టేబుల్‌ చైర్‌పై నుండి టేబుల్‌ మీద వరకు ..అతి పొడవైనదిగా ఆ పైథాన్‌ కనిపించింది. అతడు భయపడుతూనే పైథాన్‌ను పట్టేశాడు. దాని పొడవు దాదాపు 11 అడుగులకు మించి ఉన్నట్టుగా తెలిసింది. బుడెరిమ్‌లో గత వారంలో కూడా మరో రెండు పైథాన్లు కనిపించినట్టుగా ఆ ఇంటి యజమాని చెబుతున్నారు. ఇలా రెండు వారాల వ్యవధిలోనే మొత్తం మూడు జతలు,అంటే ఆరు పైథాన్లు కనపించాయట. ఇదంతా వీడియో తీసిన ఆ ఇంటి యజమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్‌ చేశాడు దాంతో వీడియో కాస్త వైరల్‌ అవుతోంది. బాబోయ్‌ ఒకే ఇంటి ఆవరణలో ఆ కొండచిలువలు కనిపించాయంటే మామూలు విషయం కాదుబాస్‌ అంటూ నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. వీడియో వైరల్‌ కావటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..