AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Patel resignation: హస్తం పార్టీకి హ్యాండిచ్చిన హార్థిక్ పటేల్.. గుజరాత్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బిగ్ షాక్..

మూలిగే నక్కపై తాటికాయపడింది. గుజరాత్ లో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. పాటిదార్ ఉద్యమాన్ని ముందుకు నడిపిన హార్థిక్ పటేల్ హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Hardik Patel resignation: హస్తం పార్టీకి హ్యాండిచ్చిన హార్థిక్ పటేల్.. గుజరాత్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బిగ్ షాక్..
Hardik Patel
Sanjay Kasula
|

Updated on: May 18, 2022 | 6:00 PM

Share

కాంగ్రెస్(Congress) కష్టాల కడలి కొనసాగుంది. తాజాగా కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. గుజరాత్ లో హస్తం పార్టీ కల చెదిరింది. బీజేపీ కుంభస్థలాన్నే ఢీకొట్టాలని కలలు కన్న కాంగ్రెస్ కు కన్నీరే ముగిలింది. గుజరాత్ లో పుంజుకుంటున్న హస్తం పార్టీకి పాటిదార్ ఉద్యమ నేత, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్(Hardik Patel) ఊహించని షాక్ ఇచ్చారు. తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ధైర్యంగా రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు హార్ధిక్ పటేల్. తన నిర్ణయాన్ని సహచరులు, గుజరాత్ ప్రజలందరూ స్వాగతిస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నానని ట్వీట్టర్ లో చెప్పారు హార్ధిక్. ఈ దశ తర్వాత, భవిష్యత్తులో గుజరాత్ కోసం తాను నిజంగా సానుకూలంగా పని చేయగలనని నమ్ముతున్నానని తెలిపారు హార్ధిక్ పటేల్.

హార్ధిక్ పటేల్ రాజీనామాతో కాంగ్రెస్ కష్టాల కడలి ఇంకా కొనసాగేలా కనిపిస్తుంది. మొన్న రాజస్థాన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ లో యువతను ప్రోత్సహిస్తాం. 50 శాతం యువతకు సీట్లు కేటాయిస్తామని ప్రకటించింది కాంగ్రెస్. తర్వలో జరగబోయే గుజరాత్ ఎన్నికల నుంచే ప్లాన్ అమలు చేయాలని ఊహించింది. అది.. బీజేపీ కుంభ స్థలం గుజరాత్ నుండి.. హర్థిక్ స్టార్ట్ చేద్దామనుకుంది. ఇంతలోనే గుజరాత్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న హార్థిక్ పటేల్ హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. ఈ పరిస్థితిని చూస్తే ఆపార్టీకి అవే చింతలు తప్పేలా లేవు.

గుజరాత్‌ పీసీసీలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న హార్థిక్‌ పటేల్‌.. గత కొంత కాలంగా ఆయన పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు హార్దిక్ పటేల్ ను పక్కన పెట్టారని, పట్టించుకోలేదనే వార్తలు హార్దిక పటేల్ ను రాజీనామా దిశగా తీసుకెళ్లాయి. ఇక 2015లో జరిగిన పటేల్ ఉద్యమానికి హార్దిక్ పటేల్ నాయకత్వం వహించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడారు హార్ధిక్.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు హార్థిక్. కానీ, ఉద్యమంలో భాగంగా అల్లర్లు, ఆందోళన కేసులో దోషిగా తేల్చిన సుప్రీం కోర్టు.. ఆయనను అప్పటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించలేదు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో హార్దిక్ పటేల్ పోటీ చేసేందుకు సుప్రీం అనుమతినిచ్చింది. అయితే ఎన్నికల ముందుకు కాంగ్రెస్ కండువా కప్పుకున్న హార్థిక్ పటేల్ మళ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడడం కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.