“విడాకులు తీసుకున్న భార్యకు ఆదాయం వస్తున్నా భరణం ఇవ్వాల్సిందే”.. బాంబే హై కోర్టు కీలక తీర్పు

అత్యాచారాలు, విడాకులు, పెళ్లిళ్లు వంటి కేసుల్లో పలు కీలక తీర్పులిస్తూ బొంబాయి హై కోర్టు(Bombay High Court) సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో తీర్పును వెలువరించి హాట్ టాపిక్ గా మారింది. భర్త నుంచి....

విడాకులు తీసుకున్న భార్యకు ఆదాయం వస్తున్నా భరణం ఇవ్వాల్సిందే.. బాంబే హై కోర్టు కీలక తీర్పు
Bombay High Court
Follow us

|

Updated on: May 18, 2022 | 5:42 PM

అత్యాచారాలు, విడాకులు, పెళ్లిళ్లు వంటి కేసుల్లో పలు కీలక తీర్పులిస్తూ బొంబాయి హై కోర్టు(Bombay High Court) సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో తీర్పును వెలువరించి హాట్ టాపిక్ గా మారింది. భర్త నుంచి విడాకులు పొందిన భార్య.. పనిచేసుకుంటా ఆదాయం పొందుతున్నా ఆమెకు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. విడాకులు తీసుకున్న భార్య ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నప్పటికీ ఆమె భరణం పొందే హక్కును కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. ఉద్యోగం చేసినప్పటికీ భరణానికి అర్హురాలేనని తేల్చింది. అంతే కాకుండా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. మహారాష్ట్రలోని కొల్హాపుర్​కు చెందిన దంపతులకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 2012లో ఓ కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ విభేధాలు ఘర్షణకు దారి తీశాయి. ఈ క్రమంతో అత్తింటి వారు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సదరు వివాహిత.. భర్త, అత్తింటివారిపై కేసు పెట్టింది. దీంతో ఈ దంపతులు 2015లో విడాకులు తీసుకున్నారు. వారి కుమారుడు తల్లి వద్దే ఉంటున్నాడు.

తన కుమారుడితో పాటు తనకూ భరణం ఇవ్వాలని కోరతూ.. భార్య సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు నెలకు రూ.5వేలు భరణం చెల్లించాలంటూ 2021 మార్చిలో తీర్పు ఇచ్చింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భర్త బొంబాయి హైకోర్టులో పిటిషన్​ వేశారు. తన భార్య ఉద్యోగం చేస్తోందని, రోజుకు రూ.150 వరకు సంపాదిస్తోందని కోర్టుకు చెప్పారు. అందుకే ఆమెకు ప్రత్యేకంగా భరణం చెల్లించాల్సిన అవసరం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.

ప్రస్తుత జీవన విధానంలో మహిళ పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భార్య భరణం హక్కును ఆమె సంపాదించే ఆదాయంతో అడ్డుకోలేమని పేర్కొంటూ సెషన్స్​కోర్టు తీర్పును సమర్థించింది. భర్త పిటిషన్​ను కొట్టి వేసింది.ఈ తీర్పు ఉద్యోగం చేస్తూ విడాకులు తీసుకున్న చాలా మంది మహిళలకు ఉపశమనమని పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీచదవండి

Fake Certificate Scam: హైదరాబాద్‌ నకిలీ సర్టిఫికెట్‌ రాకెట్‌ ముఠా అరెస్ట్‌! ప్రముఖ యూనివర్సిటీ వీసీ చేతివాటం..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు