Fake Certificate Scam: హైదరాబాద్‌ నకిలీ సర్టిఫికెట్‌ రాకెట్‌ ముఠా అరెస్ట్‌! ప్రముఖ యూనివర్సిటీ వీసీ చేతివాటం..

నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌ ఉదంతంలో తీగ లాగితే డొంకంత కదిలింది. హైదరాబాదులో ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఒక కన్సల్టెన్సీని పట్టుకుంటే ఏకంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్లే ఈ దందా ప్రోత్సహిస్తున్నారని..

Fake Certificate Scam: హైదరాబాద్‌ నకిలీ సర్టిఫికెట్‌ రాకెట్‌ ముఠా అరెస్ట్‌! ప్రముఖ యూనివర్సిటీ వీసీ చేతివాటం..
Hyderabad Crime Branch
Follow us
Srilakshmi C

|

Updated on: May 18, 2022 | 5:04 PM

Hyderabad police arrest VC of Bhopal’s SRK University: నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌ ఉదంతంలో తీగ లాగితే డొంకంత కదిలింది. హైదరాబాదులో ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఒక కన్సల్టెన్సీని పట్టుకుంటే ఏకంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్లే ఈ దందా ప్రోత్సహిస్తున్నారని విచారణలో తెలిసింది. దీంతో హైద్రాబాద్‌ క్రైమ్ పోలీసులు భూపాల్ వెళ్లి ప్రస్తుత వైస్ ఛాన్సలర్‌ను, అలాగే గతంలో వైస్ ఛాన్సలర్ గా పని చేసిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బయటపడిన నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌కు సంబంధించి మలక్‌పేట, ఆసిఫ్ నగర్, ముషీరాబాద్, చాదర్‌ఘాట్ పీఎస్‌లో కొందరు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అండ్ మేనేజ్‌మెంట్ ఏజెంట్లపై 4 కేసులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీస్‌లు కేస్ విచారణ చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ విశ్వవిద్యాలయం (SRKU).. విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా, అటెండెన్స్ లేకుండా 2 నుంచి 4 లక్షల రూపాయలు వసూలు చేయడం ద్వారా సర్టిఫికెట్స్ ఇస్తున్నట్టు తేలింది. మొత్తం 101 సర్టిఫికెట్స్ జారీ చేయాగ వీరిలో విద్యార్థుల నుంచి 44 సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ 44 సర్టిఫికెట్లలో..13 బీటెక్‌ , బీఈ కోర్సులకు చెందినవి కాగా మిగిలిన 31 ఎంబీఏ, బీఎస్సీ ఇతర కోర్సులకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్లుగా గుర్తించారు.

ఇందులో ప్రధాన సూత్రం దారి ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్. సునీల్ కపూర్ ముందస్తు బెయిల్ పొందగా SRK యూనివర్సిటీకి చెందిన కేతన్ సింగ్ అనే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ఈ కేసులో అరెస్టు చేశారు. వీరితో పాటు హైదరాబాద్‌లోని వివిధ విద్యాసంస్థలకు చెందిన ఏడుగురు ఏజెంట్లు ఎ.శ్రీకాంత్ రెడ్డి, ఎ.శ్రీనాధ్ రెడ్డి, పట్వారీ శశిదర్, పికెవి స్వామి, గుంటి మహేశ్వర్ రావు, ఆసిఫ్ అలీ, టి.రవికాంత్ రెడ్డి, ఉప్పరి రంగరాజులను అరెస్టు చేశారు. ఫేక్ సర్టిఫికెట్స్ పొందిన 19 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ కేసులో సంబంధమున్న ఇతర నేరస్తులను, ఫేక్ సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులను గుర్తించి, వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.