AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Police Training 2022: తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ.. ఇదే చివరి అవకాశం..

తెలంగాణ పోలీస్‌ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌కు (Free Training classes for police jobs) ఉద్యోగాలకు ప్రయత్నించే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించడానికి ఉచిత శిక్షణ కోసం బీసీ సంక్షేమ శాఖ (TS BC Welfare Department) మరోఅవకాశం కల్పిస్తోంది..

Free Police Training 2022: తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ.. ఇదే చివరి అవకాశం..
Free Coaching
Srilakshmi C
|

Updated on: May 18, 2022 | 3:42 PM

Share

Free Training classes for Telangana police job aspirants 2022: తెలంగాణ పోలీస్‌ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌కు (Free Training classes for police jobs) ఉద్యోగాలకు ప్రయత్నించే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించడానికి ఉచిత శిక్షణ కోసం బీసీ సంక్షేమ శాఖ (TS BC Welfare Department) ఇటీవల ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించింది. 50 మార్కులకు పైగా వచ్చిన ఉమ్మడి జిల్లా నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ సూత్రపు అనిల్‌కుమార్‌ తెలిపారు. చివరి అవకాశమని, ఆయా పరీక్షలకు సన్నద్ధమవుతూ అర్హత కలిగిన అభ్యర్థులు మే 20లోగా సంబంధిత ధ్రువపత్రాలతో బీసీ స్టడీ సర్కిల్‌లో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 0870-2571192 నెంబరును సంప్రదించాలన్నారు.

కాగా పోలీస్‌ విభాగంలో భర్తీ చేయనున్న 18,334 కొలువుల సాధనకు యువతను సన్నద్ధం చేసే దిశగా తెలంగాణ పోలీస్‌ శాఖతోపాటు, పలు సంస్థలు ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయా శిక్షణ కేంద్రాల్లో (Police training centers) అభ్యర్ధులను సిద్ధం చేస్తున్నారు కూడా. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక హోంశాఖ ఆధ్వర్యంలో 2015లో 9281, 2018లో 18,143 పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడగా.. ఈసారి అంతకన్నా ఎక్కువగా 18,334 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 95 శాతానికి పైగా కానిస్టేబుల్‌ కొలువులే అధికంగా ఉండటంలో ఈ సారి గట్టిపోటీ నెలకొంది. కొత్త జోనల్‌ వ్యవస్థ అమలులోకి వచ్చాక ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాల భర్తీ ఇదే తొలిసారి. ఈ వ్యవస్థలో కానిస్టేబుల్‌ పోస్టులన్నీ జిల్లా కేడర్‌కు చెందినవే కావడంతో యూనిట్ల వారీగా పోటాపోటీగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి మహిళా ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.