AP 10th Class Results 2022: జూన్ 10లోపు ఆంధప్రదేశ్ టెన్త్ పబ్లిక్ పరీక్షల 2022 ఫలితాలు..
ఆంధప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షా ఫలితాలను జూన్ 10వ తేదీలోపు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెల్పింది. సమాధాన పత్రాల మూల్యాంకనం..
AP SSC Result date 2022: ఆంధప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్షా ఫలితాలను జూన్ 10వ తేదీలోపు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెల్పింది. సమాధాన పత్రాల మూల్యాంకనం మే చివరి నాటికి పూర్తి చేయనున్నారు. మూల్యాంకనం అనంతరం ఇతర కార్యకలాపాలను ఐదారు రోజుల్లో పూర్తి చేసి, ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. పదో తరగతి మార్కుల ఆధారంగానే ఈ ఏడాది ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. మే 13 నుంచి పేపర్ వాల్యుయేషన్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పాఠశాల విద్య రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్ 10 లోపు విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.
ప్రస్తుతం అన్ని జిల్లాల్లో మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ ప్రక్రియ ముగియగానే విజయవాడలోని రాష్ట్ర పరీక్షల విభాగం కార్యాలయంలో డీ కోడింగ్ ప్రక్రియ నిర్వహించి.. జూన్ 10 లోపు ఫలితాల వెల్లడికి చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి 26 జిల్లాలను యూనిట్‌గా తీసుకుని పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.