Dental Health: దంతాలు మెరవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే.. లిస్టులో టీ, కాఫీలతో పాటు..
Dental Health: అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపడమే కాకుండా దంతాల మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. దీని వల్ల మన దంతాలు పసుపు రంగులోకి మారుతాయి.
Updated on: May 18, 2022 | 5:34 PM

పొగాకు ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది దంతాల మీద చాలా చెడు ప్రభావం చూపుతుంది. ధూమపానం, పొగాకు నమలడం వల్ల దంతాలపై మరకలు ఏర్పడతాయి. కాబట్టి పొగాకుకు దూరం ఉండాలి.

టీ ఎక్కువగా తాగడం వల్ల దంతాల మెరుపు మాయమైపోతుంది. టీకి బదులుగా గ్రీన్ టీని ఉపయోగించవచ్చు. ఈ హెర్బల్ టీ ఆరోగ్యానికి కూడా చాలామంచిది.

బిజీ షెడ్యూల్ కారణంగా, రోజంతా ఎనర్జిటిక్ గా ఉండేందుకు తరచుగా బ్లాక్ కాఫీని ఎక్కువగా తాగుతుంటారు. కానీ బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగడం వల్ల దంతాలు పాడవుతాయి. ఇది ఆరోగ్యానికి కూడా హానికరం.

అనారోగ్యకరమైన జీవనశైలి, కొన్ని చెడు అలవాట్ల వల్ల దంతాలు సహజమైన మెరుపును కోల్పోతాయి. పసుపు రంగుకు మారిపోతుంటాయి. ఇందుకు కొన్ని ఆహార పదార్థాలు కూడా కారణమవుతాయి. మరి దంతాలు మిలమిలలాడాలంటే వాటిని దూరం పెట్టాల్సిందే..

రెడ్ వైన్ తాగాలనుకుంటే.. తక్కవ మోతాదులో తీసుకోవడం ఉత్తమం. పరిమితికి మించి తీసుకుంటే ఆరోగ్యంతో పాటు దంతాలను దెబ్బతీస్తాయి. ఇందులో ఉండే ఆమ్లాలు దంతాల మెరుపును దెబ్బతీస్తాయి.

White Teeth




