రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు మంచి బలవర్దకమయిన ధాన్యం. ఇందులోని కాల్షియం పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
రాగుల్లో ఉండే అమినోయాసిడ్స్, ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం ఆకలి తగ్గిస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్ ఎముకల పటుత్వానికి తోడ్పడుతుంది. రాగులతో ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి.
రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి. మధుమేహ బాధితులకు రాగులతో చేసిన ఆహార పదార్థాలు మంచి ఔషధంగా పనిచేస్తుంది. రాగి జావను తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది.
అలాగే రాగుల్లో ఉండే పోషకాలు, ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ అందుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. కాలేయంలోని అదనపు కొవ్వు తొలగి, కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది.
రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది. రాగులను క్రమంతప్పకుండా వినియోగిస్తుంటే, పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులకు దూరం చేస్తుంది.
వృద్దాప్యంలో రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల శరీరానికి బలం, శక్తిని అందిస్తాయి. రాగుల్లోని పోషకాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను శుభ్రపరుస్తాయి. వృద్ధాప్యాన్ని దూరం చేసి యవ్వనంగా ఉంచుతుంది.
రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి. వారిలో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది. గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది.