Watch Video: ఓడియన్ స్మిత్ దెబ్బకు పేకమేడలా కూలిన పంజాబ్ టీం.. ఫన్నీ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ 10 సెకన్ల వీడియోలో, పంజాబ్ కింగ్స్ ఆటగాడు ఓడియన్ స్మిత్ చేసిన ఓ పని తర్వాత.. మిగతా ఆటగాళ్లంతా కిందపడిపోయారు.

Watch Video: ఓడియన్ స్మిత్ దెబ్బకు పేకమేడలా కూలిన పంజాబ్ టీం.. ఫన్నీ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
Punjab Kings, Odean Smith Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: May 17, 2022 | 3:40 PM

పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)కు ప్లేఆఫ్స్ తలుపులు దాదాపు మూసుకపోయాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడినా కూడా ఈ రేసులో నిలవడం చాలా కష్టం. కాగా, PBKS ఆటగాడు ఓడియన్ స్మిత్(Odean Smith) చేసిన ఓ వినోదభరితమైన పనితో సోషల్ మీడియాలో భయాందోళనలను సృష్టించింది. ఈ వీడియో చూస్తున్న వారికి నవ్వు ఆగదు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఓడియన్ స్మిత్ ఒక్కసారి తుమ్మడంతో పంజాబ్ జట్టు మొత్తం పేకమేడలా పడిపోయింది. సరదాగా చేసిన ఈ చిన్న స్కిట్.. నెటిజన్లకు ఎంతో సరదాను అందించింది.

Also Read: IND vs SA: 12 మ్యాచ్‌ల్లో 368 పరుగులతో దుమ్ము రేపిన తెలుగబ్బాయ్.. టీమిండియా జెర్సీ ధరించే ఛాన్స్.. ఎవరో తెలుసా?

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ 10 సెకన్ల వీడియోలో, పంజాబ్ కింగ్స్ ఆటగాడు ఓడియన్ స్మిత్ తుమ్మిన తర్వాత.. మిగతా ఆటగాళ్లంతా కిందపడిపోతూ ఉంటారు. ఈ వీడియోలో స్మిత్ మాములుగా ముందుకు నడుచుకుంటూ వచ్చి పెద్దగా తుమ్మాడు. వారి ముందు నిలబడిన మిగిలిన ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు కిందపడిపోతూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను పంజాబ్ కింగ్స్ టీం నెట్టింట్లో షేర్ చేసింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఆటగాళ్లు పడిపోతున్నట్లే.. మీ వికెట్లు కూడా పడిపోతూనే ఉన్నాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే, అభిమానుల అంచనా సరైనదేనని తేలింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో PBKS ఓడిపోయింది.

ఐపీఎల్ 15లో భాగంగా 64వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 17 పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. డీసీ తరపున శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ తరపున జితేష్ శర్మ అత్యధిక పరుగులు చేశాడు. అతను 34 బంతుల్లో 44 పరుగులు చేశాడు. కానీ, అతను తన జట్టును గెలిపించలేకపోయాడు.

Also Read: PBKS vs DC IPL Match Result: పంజాబ్ పై విజయం సాధించిన ఢిల్లీ.. ప్లే ఆఫ్ ఆశలు పదిలం

IPL 2022: కోహ్లీ, రోహిత్ పేలవ ఫామ్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?