IPL 2022: కోహ్లీ, రోహిత్ పేలవ ఫామ్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?
టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం బ్యాడ్ ఫాంలో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎలో లీగ్‌లో పేలవమైన ఆటతో తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో రానున్న ప్రపంచ కప్‌లో వీరి ప్రదర్శన ఎలా ఉంటుందోనని..
ప్రస్తుతం జరుగుతున్న 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ బ్యాట్‌తో చాలా ఆందోళన కలిగించారు. ముఖ్యంగా అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో 2022 టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఆడనుంది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఈ సీజన్‌లో ఈ భారత సీనియర్ల ప్రదర్శనలపై శుక్రవారం మాట్లాడాడు. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 113.46 స్ట్రైక్ రేట్‌తో కేవలం 19.67 సగటుతో 236 పరుగులు చేశాడు. అతని ఖాతాలో ఒక అర్ధ సెంచరీ, మూడు గోల్డెన్ డక్ అవుట్‌లు ఉన్నాయి. 14 ఏళ్ల ఐపీఎల్‌లో కోహ్లి చెత్త ప్రదర్శన ఇదే కావడం విశేషం. ప్రారంభ ఎడిషన్‌లో మాత్రమే, అతను ఈ సంవత్సరం కంటే తక్కువ పరుగులు చేశాడు. అయితే లీగ్ దశలో RCB ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం పోటీ పడుతోంది.
మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ 12 గేమ్‌లలో 125.29 స్ట్రైక్ రేట్‌తో కేవలం 18.17 సగటు వద్ద 218 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సింగిల్-డిజిట్ స్కోర్‌లతోపాటు ఒక డక్ ఔట్ ఉంది. ఈ సీజన్‌లో రోహిత్ ఇంకా హాఫ్ సెంచరీ కొట్టలేదు. కాగా, ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ మరో రెండు గేమ్‌లు ఆడాల్సి ఉంది.
మిడ్ డేతో గంగూలీ మాట్లాడుతూ, T20 ప్రపంచ కప్‌నకు ఇంకా చాలా దూరం ఉంది. వారి ప్రస్తుత ఫామ్‌పై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించాడు. “రోహిత్ లేదా విరాట్ ఫామ్ గురించి నేను అస్సలు ఆందోళన చెందను. వారు చాలా మంచివారు. వారు దిగ్గజ ఆటగాళ్ళు. ప్రపంచ కప్ చాలా దూరంలో ఉంది. టోర్నమెంట్‌కు వారు తమ పూర్వ ఫాంలోకి వస్తారని నాకు చాలా నమ్మకంగా ఉంది”అని పేర్కొన్నాడు.
2022 IPL తరువాత, జూన్‌లో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఆడనుంది. అలాగే మరో నాలుగు T20I సిరీస్‌లను ఆడేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. అందులో ఐర్లాండ్‌తో టీ2o సిరీస్‌తోపాటు ఇంగ్లండ్‌తో మూడు, ఆస్ట్రేలియాతో స్వదేశంలో మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఇది ఇంకా BCCI నిర్ధారించలేదు.
Also Read: PBKS vs DC Live Score, IPL 2022: ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. స్కోరెంతంటే?