Watch Video: ఐపీఎల్ నుంచి ఆ ఆటగాడిని తొలగించండి.. సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్.. ఎందుకంటే?
రియాన్ పరాగ్ చర్య ఎవరికీ నచ్చలేదు. క్రికెట్ అభిమానుల నుంచి వ్యాఖ్యాతల వరకు అంతా ఆయన చేసిన పనిని వ్యతిరేకించారు. ఈ ఘటన లక్నో ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో జరిగింది.
ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. కానీ, టీమ్ లాగే రియాన్ పరాగ్(Riyan Parag) కూడా సంచలనంగా మారాడు. అయితే, అది బ్యాట్‌తో మాత్రం కాదు. అతని చేష్టలతో నెట్టింట్లో తీవ్ర విమర్శలపాలవుతున్నాడు. మైదానంలో చేసిన కొన్ని జిమ్మిక్స్.. అతనిని విలన్‌గా మార్చాయి. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్టు చివరి ఓవర్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మైదానంలో రియాన్ పరాగ్ చేసిన పని ఎవరికీ నచ్చలేదు. క్రికెట్ అభిమానుల నుంచి వ్యాఖ్యాతల వరకు, ఫీల్డ్ నుంచి సోషల్ మీడియా వరకు రియాన్ పరాగ్ చర్యలను తప్పుబడుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరిగింది, అతనేం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.
Also read: Women’s IPL 2022 Squad: మహిళల టీ20 ఛాలెంజ్‌కు రంగం సిద్ధం.. ఆ ఇద్దరికి షాకిచ్చిన బీసీసీఐ.. కెప్టెన్‌లుగా ఎవరంటే?
రియాన్ పరాగ్‌కు సంబంధించిన ఈ సంఘటన లక్నో ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో జరిగింది. ప్రసీద్ధ్ కృష్ణ వేసిన ఈ ఓవర్ రెండో బంతికి అతను చేయకూడని పని చేశాడు. లక్నో బ్యాట్స్‌మెన్ మార్కస్ స్టోయినిస్ భారీ షాట్ ఆడాడు. బంతి గాలిలో లేవడంతో రియాన్ పరాగ్ క్యాచ్ పట్టుకున్నాడు. అయితే, క్యాచ్ పట్టే వరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు బంతిని నేలపై రుద్దడం ప్రారంభించాడు. దీంతో ఒక్కసారిగా విమర్శలు మొదలయ్యాయి.
సోషల్ మీడియాలో రియాన్ పరాగ్ చర్యపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కోపంగానీ, అహంకారంగానీ చూపని బ్యాట్స్‌మెన్ కోసం ఇలాంటి పని చేయడం ఎవరికీ నచ్చలేదు. దీంతో అంతా రియాన్ పరాగ్‌ను ఫూల్ అని పిలుస్తూ, ఐపీఎల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఏ ఆటగాడు ఇలా చేయకపోవడంతో, కలత చెందిన ఫ్యాన్స్.. దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.
రియాన్ పరాగ్ చర్య క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించడమే కాదు. బదులుగా, ఇది మ్యాచ్‌లో వ్యాఖ్యానిస్తున్న చాలా మంది ప్రసిద్ధ క్రికెటర్లకు కూడా కోపం తెప్పించింది. ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ, ఈ యువ ఆటగాడికి నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను, “క్రికెట్ సుదీర్ఘ ఆట. ప్రతి ఒక్కరి జ్ఞాపకాలు దానితో ముడిపడి ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ‘అదృష్టాన్ని ఎప్పుడూ సవాలు చేయకూడదు. లేకపోతే అదే విషయం రివర్స్‌లో జరుగుతుంది. భవిష్యత్తులో తెలుస్తుంది’ అని వెస్టిండీస్‌కు చెందిన ఇయాన్ బిషప్ పేర్కొన్నాడు.
— ChaiBiscuit (@Biscuit8Chai) May 16, 2022