IPL 2022 Points Table: ప్లే ఆఫ్ రేసులో నిలిచిన రాజస్థాన్.. లక్నో సూపర్ జెయింట్స్‌కి పొంచి ఉన్న ప్రమాదం..!

IPL 2022 Points Table: IPL 2022 ప్లే ఆఫ్‌లో ఇప్పటికే గుజరాత్ తన బెర్త్‌ని ఖరారు చేసుకుంది. ఆదివారం మరో విజయంతో మొదటి స్థానంలో పటిష్టంగా నిలిచింది.

IPL 2022 Points Table: ప్లే ఆఫ్ రేసులో నిలిచిన రాజస్థాన్.. లక్నో సూపర్ జెయింట్స్‌కి పొంచి ఉన్న ప్రమాదం..!
Ipl 2022 Points Table
Follow us
uppula Raju

|

Updated on: May 16, 2022 | 6:36 AM

IPL 2022 Points Table: IPL 2022 ప్లే ఆఫ్‌లో ఇప్పటికే గుజరాత్ తన బెర్త్‌ని ఖరారు చేసుకుంది. ఆదివారం మరో విజయంతో మొదటి స్థానంలో పటిష్టంగా నిలిచింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించడం ద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి చేరింది. ప్లేఆఫ్‌ల రేసులో మిగతా జట్లకంటే ముందంజలో ఉంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ను చాలా సులభంగా ఓడించింది. CSKని కేవలం 133 పరుగులకే కట్టడి చేసింది. తర్వాత గుజరాత్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ 20 పాయింట్లకు చేరుకోగా జట్టుని రెండో స్థానానికి పడిపోకుండా పటిష్టం చేసుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్‌ ప్లే ఆఫ్‌కి చేరుకునే సమయంలో పేలవంగా ఆడుతోంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈసారి రాజస్థాన్‌తో చేతిలో ఓడిపోయింది. రాజస్థాన్‌ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని కేఎల్‌ రాహుల్‌ జట్టు చేధించలేక 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. లక్నోకి ఇది 13వ మ్యాచ్ ఇందులో ఓటమితో జట్టు 16 పాయింట్లతో ఉంది. మరోవైపు ఈ విజయంతో రాజస్థాన్ 2 పాయింట్లు పొంది లక్నోతో సమానంగా 16 పాయింట్లు సాధించింది. అయితే అదే సమయంలో రాజస్థాన్ నెట్ రన్ రేట్ కూడా మెరుగుపడింది. దీని కారణంగా జట్టు లక్నో నుంచి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఫలితం లక్నోకు చాలా నష్టం కలిగించింది. ఇప్పుడు లక్నో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.

లక్నోతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కూడా 16 పాయింట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బెంగళూరుకు కేవలం 2 పాయింట్లు మాత్రమే అవసరం కాగా చివరి మ్యాచ్‌ గుజరాత్‌తో ఆడాల్సి ఉంది. బెంగుళూరు NRR మైనస్‌లో ఉంది. అయినప్పటికీ RCB చివరి మ్యాచ్‌లో గుజరాత్‌పై భారీ విజయాన్ని నమోదు చేస్తే.. మరోవైపు లక్నో చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నుండి భారీ ఓటమిని అందుకుంటే ఇక అంతే సంగతులు..

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Peppermint Tea: పుదీనా టీ తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!

Fenugreek: మెంతులతో చుండ్రు సమస్యలకి చెక్‌.. ఈ విధంగా చేయండి..!

Viral Video: కుక్క స్కేటింగ్‌ చేయడం ఎప్పుడైనా చూశారా.. తమాషా వీడియో..!

సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..