IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ప్లాప్.. చివరి ఐదు ఓవరల్లో ఒక బౌండరీ లేదు..!
IPL 2022: ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ముగిసింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోకుండా లీగ్ దశలోనే నిష్క్రమించింది.
IPL 2022: ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ముగిసింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోకుండా లీగ్ దశలోనే నిష్క్రమించింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా పటిష్టంగా రాణిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అది కూడా జరగలేదు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై అట్టర్ ప్లాప్ అయింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు ఆరంభం బాగాలేకపోవడంతో మూడో ఓవర్ లోనే డెవాన్ కాన్వే పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత ఇతర బ్యాట్స్‌మెన్ కూడా పెద్దగా ఆడలేకపోయారు. జట్టు తరఫున ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్, ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న నారాయణ్ జగదీషన్ 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రితురాజ్ (53) అర్ధ సెంచరీతో రాణించగా జగదీసన్ అజేయంగా 39 పరుగులు చేశాడు. అయితే ఇద్దరి బ్యాటింగ్ చాలా నెమ్మదిగా ఉంది.
చెన్నై బ్యాట్స్‌మెన్ పూర్తి 20 ఓవర్లు ఆడి కేవలం 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేశారు. సహజంగానే గుజరాత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. పిచ్ బ్యాటింగ్ చేయడానికి అనకూలంగా లేదు. కానీ చెన్నై బ్యాట్స్‌మెన్ రన్ రేట్ పెంచడానికి ప్రయత్నించలేదు. T20 మ్యాచ్‌లలో 16 నుంచి 20 ఓవర్ల ఆటను డెత్ ఓవర్ల ఆట అంటారు. ఇందులో బ్యాట్స్‌మెన్ రిస్క్ తీసుకొని వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే చెన్నై బ్యాట్స్‌మెన్ ఈ విషయంలో చాలా విఫలమయ్యారు. చివరి 5 ఓవర్లలో CSK కేవలం 24 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. అంతేకాదు ఈ సమయంలో ఒక్క బౌండరీ కొట్టకపోవడం అత్యంత దారుణమైన విషయం. దీనిని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి