Viral Video: ఆవు ప్రేమ తల్లి ప్రేమ ఒక్కటే.. యజమానిపై దాడి చేస్తే ఊరుకుంటుందా..!

Viral Video: జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఇలాంటి

Viral Video: ఆవు ప్రేమ తల్లి ప్రేమ ఒక్కటే.. యజమానిపై దాడి చేస్తే ఊరుకుంటుందా..!
Cow Save Owner Life
Follow us
uppula Raju

|

Updated on: May 15, 2022 | 6:45 AM

Viral Video: జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఇలాంటి వీడియోలని నెటిజన్లు బాగా ఎంజాయ్‌ చేస్తారు. లైక్స్‌, కామెంట్స్‌తో హుషారెత్తిస్తారు. అలాంటి వీడియోనే ఒకటి ఈ మధ్య కాలంలో బాగా వైరల్‌ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. జంతువుల ప్రేమ ఈ విధంగా ఉంటుందా.. అని షాక్‌ అవుతున్నారు. ఇంతకీ ఈ వీడియో సంగతి ఏంటో తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి పొలంలో ఆవులని మేపుతుండటం మనం వీడియోలో గమనించవచ్చు. అయితే వెనక నుంచి అతని సహచరుడు వచ్చి ఆ వ్యక్తిని కొడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని దూరం నుంచి గమనించిన ఒక ఆవు యజమాని ప్రాణాలని కాపాడటానికి దూరం నుంచి పరుగెత్తుకుంటూ రావడం మనం వీడియోలో చూడవచ్చు. అప్పడు యజమాని వెనక ఉన్న ఆ వ్యక్తి కోపంగా వస్తున్న ఆవుని చూసి పరుగెత్తుతాడు. వెంటనే యజమాని ఆవుని దగ్గరకి తీసుకొని దానిని ఆపుతాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. పెంపుడు జంతువులు యజమానిని ఇంతలా ఆరాధిస్తాయా అనడానికి ఈ ఒక్క వీడియో చాలు.

ఇప్పటి వరకు ఈ వీడియోని 2 కోట్ల మందికి పైగా చూశారు. 18 లక్షల మందికి పైగా లైక్ చేశారు. 7 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఆవు దాని యజమాని మధ్య ఉన్న ప్రేమను అందరూ కొనియాడుతున్నారు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ సోషల్‌ మీడియాలో ఇంకా ట్రెండ్‌ అవుతూనే ఉంది. ఈ వీడియోను గుజరాత్‌కు చెందిన జన్మద్ మథ్దా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అతనికి 2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతను తరచుగా తన ఆవులకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటాడు. పెంపుడు జంతువులు తన యజమాని కోసం ప్రాణాలకైనా తెగిస్తాయి. అమితమైన విశ్వాసాన్ని చూపుతాయి.

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Viral Photos: ప్రపంచంలోనే ప్రమాదకరమైన అడవి.. వెళ్లారంటే తిరిగి రావడం దాదాపు అసాధ్యమే..!

Health Tips: ఆర్థరైటిస్‌ రోగులు ఈ ఆహార పదార్థాలని అస్సలు తినవద్దు.. ఎందుకంటే..?

Copper Bowls: వేసవిలో రాగి పాత్రలని వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!