AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs RR: లక్నోపై సూపర్ విక్టరీ సాధించిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి..

LSG vs RR: ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌, లక్నో సూపర్ సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో రాజస్థాన్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని

LSG vs RR: లక్నోపై సూపర్ విక్టరీ సాధించిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి..
Lsg Vs Rr
uppula Raju
|

Updated on: May 15, 2022 | 11:51 PM

Share

LSG vs RR: ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌, లక్నో సూపర్ సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో రాజస్థాన్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని లక్నో చేధించలేకపోయింది. కేవలం 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో ఆటగాళ్లలో దీపక్ హుడా 59 పరుగులు, మార్కస్ స్టొయినిస్‌ 27 పరుగులు, కృనాల్ పాండ్య 25 పరుగులు మినహాయించి పెద్దగా ఎవ్వరూ రాణించలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ 2, ఒబెడ్ మెక్‌కాయ్ 2, ప్రసిద్ద్‌ కృష్ణ 2, యుజ్వేంద్ర చాహల్‌ 1, అశ్విన్ 1 వికెట్‌ సాధించారు. ఈ విజయంతో రాజస్థాన్‌ (16, +0.304) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. రన్‌రేట్‌ తగ్గడంతో లఖ్‌నవూ (16, +0.262) మూడో స్థానానికి పడిపోయింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల 6 నష్టానికి 178 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 41, దేవదుత్ పడిక్కల్ 39, సంజూ శాంసన్‌ 32, రియాన్ పరాగ్ 17, నీషమ్‌ 14, అశ్విన్‌ 10, ట్రెంట్ బౌల్ట్ 17 పరుగులు చేశారు. జోస్ బట్లర్‌ (2) విఫలమయ్యాడు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2.. అవేశ్‌ఖాన్, జాసన్ హోల్డర్‌, ఆయుష్ బదోని తలో వికెట్ తీశారు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Peppermint Tea: పుదీనా టీ తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!

Fenugreek: మెంతులతో చుండ్రు సమస్యలకి చెక్‌.. ఈ విధంగా చేయండి..!

Viral Video: ఆవు ప్రేమ తల్లి ప్రేమ ఒక్కటే.. యజమానిపై దాడి చేస్తే ఊరుకుంటుందా..!