CSK vs GT Match: మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న గుజరాత్.. చెన్నైపై గ్రాండ్ విక్టరీ..
CSK vs GT Match: గుజరాత్ టైటాన్స్ తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. చెన్నై ఇచ్చిన 134 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇంకా 5 బంతులు మిగిలి..
CSK vs GT Match: గుజరాత్ టైటాన్స్ తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. చెన్నై ఇచ్చిన 134 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. చెన్నై ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మొదటి నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ వృద్దిమాన్ సాహా 57 బంతుల్లో 67* పరుగులు సాధించి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (18), వేడ్ (20), డేవిడ్ మిల్లర్ (15) చేశారు. ఇక చెన్నై బౌలర్ల విషయానికొస్తే పతిరా 2, మెయిన్ అలీ ఒక వికెట్ తీశారు. దీంతో గుజరాత్ టీ20 సిరీస్‌లో పదో గెలుపును సొంతం చేసుకుంది.
ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యాటర్లు తడబడ్డారు. గుజరాత్ బౌలర్లు దాటికి తక్కువ స్కోరుకే పరిమితం అయ్యారు. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ చేసిన 53 పరుగులు మాత్రమే అత్యధికం కావడం గమనార్హం. మొదటి నుంచి గుజరాత్ బౌలర్లు చెన్నై బ్యాటర్లను కట్టిడి చేశారు. దీంతో క్రీజులోకి వచ్చిన ప్లేయర్ వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టారు. రుతురాజ్ తర్వాత జగదీశన్ (39*), మొయిన్ అలీ (21) ఫర్వాలేదనిపించారు. డేవన్ కాన్వే (5), శివమ్ దూబే (0), ఎంఎస్ ధోనీ (7) విఫలమయ్యారు.