IPL Betting: ఐపీఎల్‌ బెట్టింగ్‌..హైదరాబాద్‌ టూ పాకిస్థాన్‌..మధ్యలో ప్రభుత్వాధికారులు, పలువురు పెద్దలు

భారత్‌లో జరిగే ఐపీఎల్‌‌ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగా ఎదురుచూస్తారో .. బెట్టింగ్ మాఫియా కూడా అదే స్థాయిలో వెయిట్ చేస్తూ వుంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఎన్నోసార్లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. తాజాగా పాకిస్థాన్ నుంచి

IPL Betting: ఐపీఎల్‌ బెట్టింగ్‌..హైదరాబాద్‌ టూ పాకిస్థాన్‌..మధ్యలో ప్రభుత్వాధికారులు, పలువురు పెద్దలు
Ipl
Follow us

|

Updated on: May 15, 2022 | 7:46 PM

భారత్‌లో జరిగే ఐపీఎల్‌‌ (ipl) కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగా ఎదురుచూస్తారో .. బెట్టింగ్ మాఫియా (betting mafia) కూడా అదే స్థాయిలో వెయిట్ చేస్తూ వుంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (indian premier league) ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఎన్నోసార్లు స్పాట్ ఫిక్సింగ్ (spot fixing) ఆరోపణలు వచ్చాయి. తాజాగా పాకిస్థాన్ (pakistan) నుంచి అందే సూచనల ఆధారంగా ఐపీఎల్ మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేస్తున్న క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌పై సీబీఐ (cbi) దర్యాప్తు చేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేసే నెట్‌వర్క్ గురించి విశ్వసనీయ సమాచారం అందడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. ఈ నెట్‌వర్క్‌లో ఢిల్లీ, జోధ్‌పూర్, జైపూర్, హైదరాబాద్ నగరాలకు చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులు, గుర్తు తెలియని ప్రభుత్వాధికారులు ఉన్నట్లుగా సీబీఐ వద్ద ఖచ్చితమైన సమాచారం ఉంది.

ఐపీఎల్ బెట్టింగ్‌లో పందెం కాసే విధంగా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ నేరాలతోపాటు అవినీతి నిరోధక చట్టం ప్రకారం మే 13న రెండు కేసులను సీబీఐ నమోదు చేసింది. ఈ క్రమంలో ఓ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఐపీఎల్ మ్యాచ్‌ల ఫలితాన్ని ప్రభావితం చేసే క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తుల నెట్‌వర్క్ గురించి సీబీఐ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. పాకిస్థాన్ నుంచి అందే సూచనల ఆధారంగా ఈ నెట్‌వర్క్ ఈ మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేస్తోంది. తద్వారా మ్యాచ్‌లపై పందెం కాసేలా చేయడానికి ప్రజలను ప్రలోభపెడుతోన్నట్లుగా సీబీఐ చెబుతోంది.

ఈ బెట్టింగ్ లావాదేవీల కోసం ఈ ముఠా సభ్యులు నకిలీ పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిచింది. ఈ క్రమంలో పలువురు బ్యాంకు అధికారులు కూడా ఈ ముఠాతో కుమ్మక్కైనట్లుగా సీబీఐ దర్యాప్తులో తేలింది. భారతీయుల నుంచి బెట్టింగ్ ద్వారా సంపాదించిన సొమ్ములో కొంత భాగం హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలి వెళ్తోన్నట్లు తేల్చింది. నిందితులు పాకిస్థాన్‌లోని వకాస్ మాలిక్‌తో టచ్‌లో వుంటున్నట్లు గుర్తించారు. సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో వకాస్ ఫోన్ నెంబర్ సైతం లభించింది.

ఈ ఎఫ్ఐఆర్‌లో దిలీప్ కుమార్, గుర్రం సతీశ్, గుర్రం వాసులను నిందితులుగా సీబీఐ పేర్కొంది. ఈ నెట్‌వర్క్ 2013 నుంచి బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. నిందితుల బ్యాంకు ఖాతా ద్వారా ఇప్పటి వరకు దాదాపు రూ.10 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు సీబీఐ వెల్లడించింది. రెండో ఎఫ్ఐఆర్‌లో సజ్జన్ సింగ్, ప్రభు లాల్ మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్, గుర్తు తెలియని ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తులను నిందితులుగా పేర్కొంది. వీరు 2010 నుంచి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వీరు జరిపిన లావాదేవీల విలువ రూ.1 కోటి మేరకు ఉంటుందని వెల్లడించింది. దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఖాతాలో 2013 నుంచి దాదాపు 43 లక్షలకు పైగా నిధులు వున్నట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.

Ananthapur: చిరుతను ఉరికించి ఉరికించి తరిమేసిన కుక్కలు, ఇంటర్‌ వీడియో కాదు..ఇది లైవ్‌ సీన్‌

Jim Green: అతి త్వరలోనే మనుషులు ఏలియన్స్‌ని కలుసుకుంటారు..నాసా మాజీ శాస్త్రవేత్త షాకింగ్‌ కామెంట్స్‌!

Cyber Fraud: సోషల్‌ మీడియా వినియోగదారులకు హెచ్చరిక..! మర్చిపోయి కూడా అలా చేయ్యొద్దు..!!

Telangana: నీ ఉద్యోగం ఉండాలంటే నేను మీ ఇంటికి రావాలి…! మహిళ ఉద్యోగికి ఎదురైన షాకింగ్‌ సీన్‌

Trees Plantation : చనిపోయిన అమ్మకోసం ఓ లాయర్‌ కొడుకు గిఫ్ట్‌..పాతికేళ్లనాటి మామిడి చెట్టును కూకటి వేళ్లతో పెకిలించాడు..!

US coast: సముద్ర తీరంలో భారీ తిమింగలం కళేబరం…స్థానికుల్ని స్థలం ఖాళీ చేయించిన పోలీసులు..దాని పొట్ట నిండా అవే..!

Mistery village: సైన్స్‌కు సాధ్యం కాని అంతు చిక్కని రహస్యం.. 12 ఏళ్లుగా అబ్బాయిలే పుట్టని ఊరు..! ఎక్కడంటే..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు