US coast: సముద్ర తీరంలో భారీ తిమింగలం కళేబరం…స్థానికుల్ని స్థలం ఖాళీ చేయించిన పోలీసులు..దాని పొట్ట నిండా అవే..!

అసని తుఫాన్‌ ఎఫెక్ట్‌తో శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరానికి బంగారు మందిరం కొట్టుకువచ్చింది. తాజాగా యూఎస్‌లోని ఓ బీచ్‌కి మరో అరుదైన మృత కళేబరం కొట్టుకువచ్చింది. దానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు దాని పొట్టలో..

US coast: సముద్ర తీరంలో భారీ తిమింగలం కళేబరం...స్థానికుల్ని స్థలం ఖాళీ చేయించిన పోలీసులు..దాని పొట్ట నిండా అవే..!
Sperm Whaleff
Follow us
Jyothi Gadda

|

Updated on: May 15, 2022 | 4:10 PM

అసని తుఫాన్‌ ఎఫెక్ట్‌తో శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరానికి బంగారు మందిరం కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి సముద్రం రేవుకు ఎప్పుడూ చూడని వింతైన రథం కొట్టుకు వచ్చింది. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వుంది. ఇది మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని అందరూ భావించారు. స్వర్ణవర్ణభరిత రథాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. అయితే, తాజాగా యూఎస్‌లోని ఓ బీచ్‌కి మరో అరుదైన మృత కళేబరం కొట్టుకువచ్చింది. దానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు దాని పొట్టలో లభించిన వస్తువులు చూసి కంగుతిన్నారు. ఇంతకీ అరుదైన మృతదేహం దేనికి, దాని పొట్టలో లభించిన వస్తువులు ఏంటీ..? వివరాల్లోకి వెళితే..

యూనైటెడ్‌ స్టేట్స్‌ అమెరికాలోని ఓ బీచ్‌కి అత్యంత భారీగా పెరిగే స్పెర్మ్‌ వేల్‌ జాతీకి చెందిన తిమింగళం మృతదేహం కొట్టుకువచ్చింది. దాని పూర్తి నిర్జీవంగా ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దాన్ని గమనించిన స్థానికులు వెంటనే బీచ్‌ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన తిమింగళాన్ని పరిశీలించగా, దాని పొడవు.. దాదాపు 47 అడుగులకు పైగా ఉంది. అధికారులు సైతం బీచ్‌ వద్దకు చేరుకున్నారు. వెంటనే పోలీసులు ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి దూర ప్రాంతానికి తరలించారు. ఎందుకంటే… మరణించిన తిమింగలం వద్ద ఉండటం ప్రమాదకరం..అది ఏ క్షణనైన పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ అది పేళితే ప్రాణాలకు ముప్పని అధికారులు తెలిపారు. ఆ తర్వాత తిమింగళం మృతదేహనికి పోస్ట్‌మార్టం కొరకు తరలించారు. చేప, వన్యప్రాణుల రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్‌కు సంబందించి బయాలజిస్ట్‌లు ఈ తిమింగళానికి పోస్ట్ మార్టం చేశారు. తిమింగలం ఎందుకు మరణించిందో కారణాలు చెప్పారు. అది విన్న పోలీసులు, అధికారులు ఖంగుతిన్నారు. తిమింగలం కడుపులో అంతా ప్లాస్టిక్ వ్యర్థాలే బయటపడ్డాయి. అవన్నీ లోపల చుట్టుకుపోవడంతో తిమింగలం మరణించిందని వారు తెలిపారు. పొట్టలో పేరుకుపోయిన వ్యర్థాల కారణంగా తిమింగలం సరిగా తిండి తినలేక పోయిందని, అందువల్లే ఆరోగ్యం క్షిణించి అది మరణించినట్టు వైద్యులు తెలిపారు.

Mistery village: సైన్స్‌కు సాధ్యం కాని అంతు చిక్కని రహస్యం.. 12 ఏళ్లుగా అబ్బాయిలే పుట్టని ఊరు..! ఎక్కడంటే..

Nizamabad : ఇదో దయనీయఘటన..ఏడు రోజుల పసికందును సాకలేనంటూ..పోలీసులను ఆశ్రయించిన తండ్రి