AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nizamabad : ఇదో దయనీయఘటన..ఏడు రోజుల పసికందును సాకలేనంటూ..పోలీసులను ఆశ్రయించిన తండ్రి

అమ్మనాన్న అందరూ ఉండి కూడా ఏడు పసికందు అనాధగా మిగిలింది. పురుడు పోసుకుని వారం రోజులు గడవకుండానే తల్లిపాలకు నోచుకోలేక తల్లడిల్లిపోతోంది. అమ్మ ఉన్నా కూడా చిన్నారి బాధ్యత తనది కాదన్నట్టుగానే వ్యవహరిస్తోంది. తండ్రి తనకు సంబంధం లేదన్నట్టుగా..

Nizamabad : ఇదో దయనీయఘటన..ఏడు రోజుల పసికందును సాకలేనంటూ..పోలీసులను ఆశ్రయించిన తండ్రి
Jyothi Gadda
|

Updated on: May 15, 2022 | 2:53 PM

Share

అమ్మనాన్న అందరూ ఉండి కూడా ఏడు పసికందు అనాధగా మిగిలింది. పురుడు పోసుకుని వారం రోజులు గడవకుండానే తల్లిపాలకు నోచుకోలేక తల్లడిల్లిపోతోంది. అమ్మ ఉన్నా కూడా చిన్నారి బాధ్యత తనది కాదన్నట్టుగానే వ్యవహరిస్తోంది. తండ్రి తనకు సంబంధం లేదన్నట్టుగా పసికందును సాకలేనంటూ ఏకంగా పోలీసులనే ఆశ్రయించాడు. పోలీసులు కల్పించుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అమ్మమ్మ, నాన్నమ్మ తరపు వాళ్లు కూడా పసికందును మాకొద్దంటే మాకొద్దంటూ విడిచిపెట్టారు దీంతో చిన్నారి ఐసీడీఎస్‌ అధికారుల చెంతకు చేరింది. ఇంతకు ఎందుకా కన్నతల్లి బిడ్డను వదిలించుకుంది.. ? ఆ తండ్రి ఎందుకు చిన్నారి పట్ల బాధ్యతా రహిత్యంగా వ్యవహరించాడు..? నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండంలో చోటు చేసుకుంది ఈ దయనీయమైన సంఘటన. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌లో ఏడు రోజుల పసికందును పోషించలేనని ఓ తండ్రి స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ..

నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌కు చెందిన రేణుకకు నీలా గ్రామానికి చెందిన నగేశ్‌తో ఏడాది క్రితం వివాహమైంది. వీరికి మే 7న ఆడపిల్ల పుట్టింది. అయితే, రేణుకకు కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేదు. మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తిస్తోంది. దాంతో గత ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. రేణుక ఇంటికి వెళ్లిన ఆశా కార్యకర్తలు పాపకు సరిగా పాలు పట్టడంలేదని గుర్తించి భర్తకు సమాచారమందించారు. దీంతో రేణుక భర్త నగేష్‌ వచ్చి పాపను తనతో పాటే తీసుకెళ్లారు. కానీ, అతని ఇంట్లో వారంతా పసికందును అలా తల్లి నుంచి దూరం చేయటం సరికాదని వారించారు. దాంతో పాపను తీసుకుని నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు… తాను పసికందును సాకలేనని చెప్పాడు. దీంతో పోలీసులు శిశువును తిరిగి తల్లి చెంతకు చేర్చారు. కానీ, పాపం పసికందును అటు నగేశ్, ఇటు రేణుక కుటుంబ సభ్యులు వద్దని వదిలించుకున్నారు. దాంతో ఐసీడీఎస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో శిశువు తల్లి వద్దే ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారు ఆ తండ్రికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.