AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అమిత్ షా పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్.. ఒకే సారి ఎన్నికలకు వెళ్దామని సవాల్

ఒకే సారి ఎన్నికలకు వెళ్దాం.. ఎవరు గెలుస్తారో ప్రజలే నిర్ణయిస్తారని తెలంగాణ(Telangana) మంత్రి తలసారి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశ వ్యాప్త ఎన్నికలకు టీఆర్ఎస్(TRS) సిద్ధంగా ఉందని...

Telangana: అమిత్ షా పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్.. ఒకే సారి ఎన్నికలకు వెళ్దామని సవాల్
Talasani
Ganesh Mudavath
|

Updated on: May 15, 2022 | 1:27 PM

Share

ఒకే సారి ఎన్నికలకు వెళ్దాం.. ఎవరు గెలుస్తారో ప్రజలే నిర్ణయిస్తారని తెలంగాణ(Telangana) మంత్రి తలసారి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశ వ్యాప్త ఎన్నికలకు టీఆర్ఎస్(TRS) సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా ను ఉద్దేశించి వ్యా్ఖ్యానించారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. గుజ్‌రాత్‌లో రెండు పడక గదులు ఇళ్లు ఎందుకు నిర్మించలేదని అమిత్ షా ప్రశ్నించారన్న మంత్రి.. రెండు పడక గదుల ఇళ్లు నిర్మించలేదనే వారు తమ వెంట వస్తే భవనాలు చూపెడతామని అన్నారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్‌(CM KCR) అంటూ ప్రశంసించారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని బండమైసమ్మలో రూ.27.50కోట్లతో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి తలసాని పాల్గొన్నారు. మంత్రి పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే అన్న అమిత్ షా.. మిగతా మంత్రులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కేంద్రమంత్రి హోదాలో అమిత్ షా ఇలా మాట్లాడడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ సంపదను ప్రధాని మోదీ అదాని, అంబానీలకు దోచిపెడుతున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశ వ్యాప్త ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. అధికారంలో ఉన్నాం కదా ఏదైనా మాట్లాడతామంటే చెల్లదు. కేంద్రమంత్రి హోదాలో అమిత్ షా ఇలా మాట్లాడటం సరికాదు. మంత్రి పదవులు అన్నీ కేసీఆర్ కుటుంబానికే అన్న అమిత్ షా మిగతా మంత్రులకు ఏం సమాధానం చెబుతారు. ఒకేసారి ఎన్నికలకు పోదాం, మీరు గెలుస్తారో, మేము గెలిస్తామో ప్రజలే నిర్ణయిస్తారు.

– తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ మంత్రి

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా.. శనివారం తుక్కుగూడలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో రజాకార్‌ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు, ప్రస్తుత నిజాం ప్రభువైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని, పనికిమాలిన, అసమర్థ ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని విమర్శించారు. కేసీఆర్‌ను తరిమేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని, ఆయనను గద్దె దించేందుకు యువత కదిలి రావాలన్నారు. తెలంగాణ ఎవరి జాగీరూ కాదని, అందరికీ సమానహక్కు ఉందని స్పష్టం చేశారు.

Also Read:

Akshay Kumar: కరోనా బారిన పడ్డ బాలీవుడ్ సూపర్‌ స్టార్‌.. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు దూరం..

Sharad Pawar: ఎన్సీపీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు.. సినీనటి అరెస్ట్‌..