Telangana: కేసీఆర్ కోటీశ్వరుడు అవుతుంటే.. రైతులు మాత్రం బికారులు అవుతున్నారు.. బండి సంజయ్ కామెంట్స్

Telangana: కేసీఆర్ కోటీశ్వరుడు అవుతుంటే.. రైతులు మాత్రం బికారులు అవుతున్నారు.. బండి సంజయ్ కామెంట్స్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రసంగం కొన్ని రాజకీయ పార్టీలకు చెంపపెట్టులాంటిదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మతల్లి గుడిని ఆయన...

Ganesh Mudavath

|

May 15, 2022 | 12:44 PM

కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రసంగం కొన్ని రాజకీయ పార్టీలకు చెంపపెట్టులాంటిదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మతల్లి గుడిని ఆయన సందర్శించారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ 31 రోజుల్లో 383 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. పాదయాత్ర, బహిరంగ సభకు భారీగా ప్రజలు, బీజేపీ(BJP) కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత విద్య, వైద్యం అనే హామీకి కట్టుబడి ఉన్నామన్న బండి సంజయ్.. ప్రజల నుంచి పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పేదరికంతో ఎంతో మంది గుడిసెల్లో నివసిస్తున్నారన్నారు. తెలంగాణలో(Telangana) బీజేపీ అధికారంలోకి వస్తే నిలువ నీడలేని అర్హులైన పేదలందరికి ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం హామీని అమలు చేసి, ఖాళీలను భర్తీ చేస్తామని వివరించారు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి, పెట్రోల్, డీజిల్ ధరలను వ్యాట్ తగ్గిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ లో వ్యవసాయం చేస్తూ కోటీశ్వరుడు అవుతుంటే రైతులు మాత్రం కేసీఆర్ నిర్ణయాలతో బికారులు అవుతున్నారని బండి సంజయ్ ఆక్షేపించారు.

కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకుంటాం. నీళ్లు, నిధులు, నియామకాలలో న్యాయం జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే. మా ప్రభుత్వం వస్తే బాయిల్డ్ రైస్ కొంటాం. 4% ఉన్న మైనారిటీ రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం. గంగిరెద్దులను ఆడించే వాళ్లపై కూడా కేసీఆర్ ప్రభుత్వం టాక్స్ లు విధిస్తారేమో.. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తాం. తెలంగాణలో ఆకుపచ్చ జెండాలను ఎగరనివ్వం. బంగాళాఖాతంలో కలిపేస్తాం.

             – బండి సంజయ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా.. శనివారం తుక్కుగూడలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో రజాకార్‌ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు, ప్రస్తుత నిజాం ప్రభువైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని, పనికిమాలిన, అసమర్థ ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని విమర్శించారు. కేసీఆర్‌ను తరిమేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని, ఆయనను గద్దె దించేందుకు యువత కదిలి రావాలన్నారు. తెలంగాణ ఎవరి జాగీరూ కాదని, అందరికీ సమానహక్కు ఉందన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ మరో బెంగాల్‌గా మారుస్తున్నారని, హత్యా రాజకీయాలతో తమ కార్యకర్త సాయిగణేశ్‌ను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అందుకు బాధ్యులైన వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

 Asaduddin Owaisi: ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు.. ఓటు బ్యాంక్‌పై ఓవైసీ కీలక కామెంట్స్‌..

Chandrababu: జగన్ ఇలాకాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్‌.. ఈనెల 18న కడపలో చంద్రబాబు పర్యటన..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu